Provérbios 7

Telugu Bible (GL_TELUGU) vs NAA

Sair da comparação
NAA Nova Almeida Atualizada 2017
1 నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.
1 Meu filho, guarde as minhas palavras e conserve os meus mandamentos em seu coração.
2 నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.
2 Observe os meus mandamentos e você viverá; guarde a minha lei como a menina dos seus olhos.
3 నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము
3 Amarre-os aos dedos, escreva-os na tábua do seu coração.
4 జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
4 Diga à Sabedoria: “Você é minha irmã”; e ao Entendimento: “Você é meu parente.”
5 అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.
5 Eles o guardarão da mulher imoral, da estranha que lisonjeia com palavras.
6 నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను
6 Porque da janela da minha casa, olhando pela grade,
7 ¸°వనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.
7 vi entre os ingênuos, e descobri entre os jovens um que não tinha juízo.
8 సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ
8 Ele ia e vinha pela rua junto à esquina da mulher estranha e seguia o caminho da casa dela,
9 వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.
9 no crepúsculo, ao anoitecer, na escuridão da noite, nas trevas.
10 అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.
10 Eis que a mulher lhe saiu ao encontro, com roupas de prostituta e astúcia no coração.
11 అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.
11 É espalhafatosa e inquieta; os seus pés não param em casa.
12 ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.
12 Ora está nas ruas, ora, nas praças, espreitando por todos os cantos.
13 అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను
13 Ela agarrou o jovem e o beijou; e com o maior descaramento lhe disse:
14 సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను
14 “Eu tinha de oferecer sacrifícios pacíficos; hoje paguei os meus votos.
15 కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి
15 Por isso, saí ao seu encontro; vim procurá-lo, e agora o encontrei!
16 నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
16 Já cobri de colchas a minha cama, de linho fino do Egito, de várias cores.
17 నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
17 Já perfumei o meu leito com mirra, aloés e cinamomo.
18 ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.
18 Venha, vamos nos embriagar com as delícias do amor, até o amanhecer; gozemos amores.
19 పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
19 Porque o meu marido não está em casa; saiu de viagem para longe.
20 అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
20 Levou consigo uma bolsa cheia de dinheiro; não voltará para casa antes da lua cheia.”
21 అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
21 Ela o seduziu com as suas muitas palavras, com as lisonjas dos seus lábios o arrastou.
22 వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
22 E, num instante, ele a seguiu, como um boi que vai para o matadouro; como um animal que corre para a armadilha,
23 తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
23 até que uma flecha lhe atravesse o coração. Ele era como a ave que corre para dentro do alçapão, sem saber que isto lhe custará a vida.
24 నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
24 Agora, meu filho, escute o que eu digo e dê atenção às palavras da minha boca.
25 జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
25 Não deixe que o seu coração se desvie para os caminhos dessa mulher, e não ande perdido nas suas veredas.
26 అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది
26 Porque a muitos ela feriu e derrubou; e são muitos os que por ela foram mortos.
27 దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.
27 A casa dela é caminho para o abismo e desce para as câmaras da morte.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Provérbios 7, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.