Salmos 98

Telugu Bible (GL_TELUGU) vs ARC

Sair da comparação
ARC Almeida Revista e Corrigida 2009
1 యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.
1 Cantai ao Senhor um cântico novo, porque ele fez maravilhas; a sua destra e o seu braço santo lhe alcançaram a vitória.
2 యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.
2 O Senhor fez notória a sua salvação; manifestou a sua justiça perante os olhos das nações.
3 ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్య తలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి.
3 Lembrou-se da sua benignidade e da sua verdade para com a casa de Israel; todas as extremidades da terra viram a salvação do nosso Deus.
4 సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.
4 Celebrai com júbilo ao Senhor , todos os moradores da terra; dai brados de alegria, regozijai-vos e cantai louvores.
5 సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి.
5 Cantai louvores ao Senhor com a harpa; com a harpa e a voz do canto.
6 బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.
6 Com trombetas e som de buzinas, exultai perante a face do Senhor , do Rei.
7 సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక.
7 Brame o mar e a sua plenitude; o mundo e os que nele habitam.
8 ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
8 Os rios batam palmas; regozijem-se também as montanhas,
9 భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
9 perante a face do Senhor , porque vem a julgar a terra; com justiça julgará o mundo e o povo, com equidade.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 98, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.