Salmos 99

Telugu Bible (GL_TELUGU)

1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.

2 సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.

3 భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించె దరు. యెహోవా పరిశుద్ధుడు.

4 యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.

5 మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు.

6 ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.

7 మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట లాడెను వారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి

8 యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివి వారిక్రియలను బట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడ వైతివి.

9 మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 99, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.