Deuteronômio 11

Telugu Bible (GL_TELUGU) vs NVT

Sair da comparação
NVT Nova Versão Transformadora
1 కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించినవాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడు గైకొనవలెను.
1 “Amem o S enhor , seu Deus, e obedeçam sempre ao que ele exige: seus estatutos, decretos e mandamentos.
2 ​నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను ఆయన మహి మను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని
2 Lembrem-se de que hoje não falo a seus filhos, que nunca experimentaram a disciplina do S enhor , seu Deus, nem viram a grandeza, a mão forte e o seu braço poderoso.
3 ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయనచేసిన సూచక క్రియలను కార్యములను
3 Eles não viram os sinais e os atos poderosos que ele realizou no Egito contra o faraó e toda a sua terra.
4 ఆయన ఐగుప్తుదండు నకును దాని గుఱ్ఱములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్ర జల మును వారిమీద ప్రవహింపజేసిన దానిని
4 Não viram o que ele fez aos exércitos dos egípcios e a seus cavalos e carros de guerra, como ele os afogou no mar Vermelho enquanto perseguiam vocês. Ele os destruiu e até hoje não se recuperaram.
5 యెహోవా నేటివరకు వారిని నశింపజేసినరీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చువరకు ఎడారిలో మీకొరకు చేసిన దానిని
5 “Seus filhos não viram como o S enhor cuidou de vocês no deserto até chegarem aqui.
6 రూబే నీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాము లకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్ద నున్న సమస్త జీవరాసు లను ఇశ్రాయేలీయులందరి మధ్యను మింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి.
6 Não viram o que ele fez a Datã e Abirão (filhos de Eliabe, descendente de Rúben) quando a terra abriu a boca no acampamento israelita e os engoliu, junto com suas famílias, tendas e todos os seres vivos que pertenciam a eles.
7 యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.
7 Vocês, porém, viram com os próprios olhos que o S enhor realizou todos esses atos poderosos!”
8 ​మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును
8 “Portanto, obedeçam a todos os mandamentos que hoje lhes dou, para que tenham forças para avançar e conquistar a terra da qual estão prestes a tomar posse.
9 ​యెహోవా వారికిని వారి సంతాన మునకును దయచేసెదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దిన మున మీకాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటిని మీరు గైకొనవలెను.
9 Se obedecerem, terão vida longa na terra que o S enhor jurou dar a seus antepassados e a vocês, os descendentes deles, uma terra que produz leite e mel com fartura!
10 ​మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలు దేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.
10 Pois a terra em que vocês estão prestes a entrar para tomar posse não é como a terra do Egito, de onde vocês vieram e onde plantavam as sementes e faziam valas de irrigação com o pé, como numa horta.
11 ​మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.
11 A terra da qual em breve tomarão posse é uma terra de montes e vales, com chuva em grande quantidade,
12 ​అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవు డైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.
12 terra da qual o S enhor , seu Deus, cuida continuamente, todo o ano!
13 ​కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మ తోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల
13 “Se obedecerem fielmente aos mandamentos que hoje lhes dou, e se amarem o S enhor , seu Deus, e servirem a ele de todo o seu coração e de toda a sua alma,
14 ​మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురి పించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షా రసమును నీ నూనెను కూర్చుకొందువు.
14 ele mandará as chuvas na estação apropriada, as chuvas de outono e de primavera, para que vocês juntem suas colheitas de cereais e produzam vinho novo e azeite.
15 ​​మరియు నీవు తిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.
15 Ele dará bons pastos para seus animais, e vocês terão alimento com fartura.
16 మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.
16 “Mas tenham cuidado! Não deixem seu coração ser enganado, levando-os a afastar-se do S enhor e a adorar outros deuses.
17 లేని యెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండ కుండ మీరు శీఘ్రముగా నశించెదరు.
17 Se o fizerem, a ira do S enhor se acenderá contra vocês. Ele fechará o céu e reterá a chuva, e a terra não produzirá suas colheitas. Em pouco tempo, vocês serão removidos da boa terra que o S enhor lhes dá.
18 కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.
18 “Gravem estas minhas palavras no coração e na mente. Amarrem-nas às mãos e prendam-nas à testa como lembrança.
19 నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి
19 Ensinem-nas a seus filhos. Conversem a respeito delas quando estiverem em casa e quando estiverem caminhando, quando se deitarem e quando se levantarem.
20 నీ యింటి ద్వారబంధములమీదను నీ గవు నులమీదను వాటిని వ్రాయవలెను.
20 Escrevam-nas nos batentes das portas de suas casas e em seus portões,
21 ఆలాగు చేసిన యెడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినము లును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.
21 para que, enquanto o céu permanecer acima da terra, vocês e seus filhos prosperem neste chão que o S enhor jurou dar a seus antepassados.
22 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు, ఆయనను హత్తుకొని, మీరు చేయవలెనని నేను మికాజ్ఞా పించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచు కొనవలెను.
22 “Obedeçam cuidadosamente a todos os mandamentos que lhes dou. Amem o S enhor , seu Deus, andando em seus caminhos e apegando-se firmemente a ele.
23 అప్పుడు యెహోవా మీ యెదుటనుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠు లైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.
23 Então o S enhor expulsará todas as nações de diante de vocês e, embora elas sejam muito maiores e mais fortes, vocês tomarão posse de suas terras.
24 మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.
24 Todo lugar em que puserem os pés será de vocês. Suas fronteiras se estenderão do deserto, ao sul, até o Líbano, ao norte, e do rio Eufrates, a leste, até o mar Mediterrâneo, a oeste.
25 ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును.
25 Aonde quer que forem em toda a terra, ninguém será capaz de lhes resistir, pois o S enhor , seu Deus, fará os povos se apavorarem e temerem vocês, como lhes prometeu.
26 చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.
26 “Vejam, hoje lhes dou a escolha entre bênção e maldição!
27 ​నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక
27 Vocês serão abençoados se obedecerem aos mandamentos do S enhor , seu Deus, que hoje lhes dou,
28 ​నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును.
28 mas serão amaldiçoados se rejeitarem os mandamentos do S enhor , seu Deus, afastando-se de seus caminhos e adorando deuses que vocês não conheciam.
29 ​కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.
29 “Quando o S enhor , seu Deus, os fizer entrar na terra da qual em breve vocês tomarão posse, pronunciem a bênção no monte Gerizim e a maldição no monte Ebal.
30 ​అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.
30 (Esses dois montes ficam a oeste do rio Jordão, na terra dos cananeus que vivem no vale do Jordão, perto da cidade de Gilgal, junto aos carvalhos de Moré.)
31 మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమును స్వాధీన పరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు.
31 Vocês estão prestes a atravessar o rio Jordão para tomar posse da terra que o S enhor , seu Deus, lhes dá. Quando a conquistarem e estiverem vivendo nela,
32 అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని మీరు అనుసరించి గైకొనవలెను.
32 tenham o cuidado de cumprir todos os decretos e estatutos que hoje lhes dou.”

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Deuteronômio 11, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.