Deuteronômio 11
Telugu Bible (GL_TELUGU) vs BKJ
1 కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించినవాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడు గైకొనవలెను.
1 Portanto, amarás ao SENHOR teu Deus, e guardarás a sua ordem, e os seus estatutos, e os seus juízos, e os seus mandamentos, sempre.
2 నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను ఆయన మహి మను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని
2 E sabei neste dia, porque eu falo não com os vossos filhos, que não sabem e que não viram a punição do SENHOR vosso Deus, a sua grandeza, a sua mão forte e o seu braço estendido,
3 ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయనచేసిన సూచక క్రియలను కార్యములను
3 e os seus milagres, e os seus atos, que ele fez no meio do Egito, a Faraó, o rei do Egito, e a toda a sua terra;
4 ఆయన ఐగుప్తుదండు నకును దాని గుఱ్ఱములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్ర జల మును వారిమీద ప్రవహింపజేసిన దానిని
4 e o que ele fez ao exército do Egito, a seus cavalos e a suas carruagens; ou como ele fez com que a água do mar Vermelho os cobrisse, quando vos perseguiam, e como o SENHOR os destruiu neste dia;
5 యెహోవా నేటివరకు వారిని నశింపజేసినరీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చువరకు ఎడారిలో మీకొరకు చేసిన దానిని
5 e o que ele vos fez no deserto, até que chegásseis a este lugar;
6 రూబే నీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాము లకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారియొద్ద నున్న సమస్త జీవరాసు లను ఇశ్రాయేలీయులందరి మధ్యను మింగివేసిన రీతిని, చూడకయు ఎరుగకయునున్న మీ కుమారులతో నేను మాటలాడుట లేదని నేడు తెలిసికొనుడి.
6 nem o que ele fez a Datã e Abirão, os filhos de Eliabe, o filho de Rúben; como a terra abriu sua boca e os tragou, e às suas famílias e suas tendas, e toda a riqueza que era sua posse, no meio de Israel;
7 యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.
7 mas os vossos olhos viram todos os grandes atos que o SENHOR fez.
8 మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును
8 Portanto, guardareis todos os mandamentos que vos ordeno hoje, para que possais ser fortes, e ir e possuir a terra, para onde vais, para possuí-la;
9 యెహోవా వారికిని వారి సంతాన మునకును దయచేసెదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దిన మున మీకాజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటిని మీరు గైకొనవలెను.
9 e para que prolongueis os vossos dias na terra, que o SENHOR jurou a vossos pais que lhes daria, e à sua semente, uma terra que mana leite e mel.
10 మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలు దేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.
10 Porque a terra para onde vais, para possuí-la, não é como a terra do Egito, de onde saístes, onde semeavas a tua semente, e a regavas com teus pés, como um jardim de ervas;
11 మీరు నది దాటి స్వాధీన పరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.
11 mas a terra para onde vais, para possuí-la, é uma terra de colinas e vales, e bebe a água da chuva dos céus;
12 అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవు డైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.
12 uma terra de que o SENHOR teu Deus cuida; os olhos do SENHOR teu Deus estão sempre sobre ela, desde o começo do ano até o fim do ano.
13 కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మ తోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల
13 E acontecerá que, se ouvirdes diligentemente os meus mandamentos, que vos ordeno hoje, que ameis ao SENHOR vosso Deus, e que o sirvais com todo o vosso coração e com toda a vossa alma,
14 మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురి పించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షా రసమును నీ నూనెను కూర్చుకొందువు.
14 que vos darei a chuva da vossa terra, na sua devida estação, na chuva temporã e na chuva serôdia, para que possas colher o teu grão, e o teu vinho, e o teu azeite.
15 మరియు నీవు తిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.
15 E enviarei grama aos teus campos, para o teu gado, para que comas e te sacies.
16 మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.
16 Cuidai para que o vosso coração não seja enganado, e não vos desviais, e sirvais a outros deuses, e os adoreis;
17 లేని యెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండ కుండ మీరు శీఘ్రముగా నశించెదరు.
17 e então a ira do SENHOR se acenderá contra vós, e ele fechará os céus, para que não haja chuva, e a terra não dê seu fruto; e para que não pereçais rapidamente na boa terra que o SENHOR vos deu.
18 కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.
18 Portanto, guardareis estas minhas palavras em vosso coração e em vossa alma, e as atarás como sinal à vossa mão, para que possam ser como testeira entre os vossos olhos.
19 నీవు నీ యింట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి
19 E vós ensinareis a vossos filhos, falando sobre elas quando tu assentares em tua casa, e quando tu andares pelo caminho, quando tu te deitares e quando tu te levantares.
20 నీ యింటి ద్వారబంధములమీదను నీ గవు నులమీదను వాటిని వ్రాయవలెను.
20 E as escreverás nos umbrais de tua casa, e nas tuas portas,
21 ఆలాగు చేసిన యెడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినము లును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.
21 para que os vossos dias se multipliquem, e os dias dos vossos filhos na terra que o SENHOR jurou a vossos pais que daria a eles, como os dias dos céus sobre a terra.
22 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు, ఆయనను హత్తుకొని, మీరు చేయవలెనని నేను మికాజ్ఞా పించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచు కొనవలెను.
22 Porque se guardardes diligentemente a todos os mandamentos que agora vos ordeno, para que os cumprais, amando ao SENHOR vosso Deus, andando em todos os seus caminhos e apegando-vos a ele,
23 అప్పుడు యెహోవా మీ యెదుటనుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠు లైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.
23 então o SENHOR expulsará todas essas nações de diante de vós, e possuireis nações maiores e mais poderosas do que vós.
24 మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.
24 Todo lugar onde pisar a sola dos vossos pés será vosso: desde o deserto e o Líbano, desde o rio, o rio Eufrates, até o mar mais distante será o vosso termo.
25 ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును.
25 Não haverá homem capaz de ficar de pé diante de vós, pois o SENHOR vosso Deus porá o temor a vós e o terror a vós sobre toda a terra que pisardes, como já vos disse.
26 చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను.
26 Eis que neste dia ponho diante de vós, uma bênção e uma maldição:
27 నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక
27 uma bênção, se obedecerdes aos mandamentos do SENHOR vosso Deus, que vos ordeno neste dia;
28 నేడు నేను మికాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుస రించిన యెడల శాపమును మీకు కలుగును.
28 e uma maldição, se não obedecerdes aos mandamentos do SENHOR vosso Deus, mas vos desviardes do caminho que vos ordeno neste dia, se buscardes outros deuses que não conheceis.
29 కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండమీద ఆ దీవెన వచనమును, ఏబాలుకొండ మీద ఆ శాపవచనమును ప్రకటింపవలెను.
29 E acontecerá que, quando o SENHOR teu Deus te tiver trazido à terra para onde vais para possuí-la, que porás a bênção sobre o monte Gerizim, e a maldição sobre o monte Ebal.
30 అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.
30 Estão eles do outro lado do Jordão, pelo caminho onde o sol se põe, na terra dos cananeus, que habitam na planície diante de Gilgal, além das planícies de Moré?
31 మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమును స్వాధీన పరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోవుచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు.
31 Pois passareis o Jordão para possuirdes a terra que o SENHOR vosso Deus vos deu, e a possuireis, e ali habitareis.
32 అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటిని విధులన్నిటిని మీరు అనుసరించి గైకొనవలెను.
32 E cuidareis de cumprir todos os estatutos e os juízos que coloco diante de vós neste dia.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Deuteronômio 11, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.