Provérbios 29

హోలీ బైబిల్ (TEL2010) vs NTLH

Sair da comparação
NTLH Nova Tradução na Linguagem de Hoje 2000
1 ఒక మనిషి మొండివాడై, అతడు చేస్తున్నది తప్పు అని ప్రజలు అతనితో చెప్పినప్పుడల్లా అతనికి మరింత కోపం వస్తే అప్పుడు ఆ మనిషి ఆకస్మాత్తుగా నాశనం చేయబడతాడు. ఆశ ఏమీ ఉండదు.
1 Quem é repreendido muitas vezes e teima em não se corrigir cairá de repente na desgraça e não poderá escapar.
2 పాలించేవాడు మంచి మనిషి అయితే ప్రజలంతా సంతోషిస్తారు.కాని ఒక దుర్మార్గుడు పాలన చేస్తే అప్పుడు ప్రజలంతా నిట్టూర్చి ఆరోపణ చేస్తారు.
2 Quando os honestos governam, o povo se alegra; mas, quando os maus dominam, o povo reclama.
3 ఒక మనిషి జ్ఞానమును ప్రేమిస్తే అప్పుడు అతని తండ్రికి చాలా సంతోషం. కాని ఒక మనిషి తన డబ్బును వేశ్యల కోసం వ్యర్థం చేస్తే అప్పుడు అతడు తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకొంటాడు.
3 O filho que ama a sabedoria é o orgulho do seu pai. Quem anda com prostitutas desperdiça tudo o que tem.
4 ఒక రాజు న్యాయంగా ఉంటే, అప్పుడు ఆ రాజ్యం బలంగా ఉంటుంది. కాని రాజు స్వార్థపరుడై ప్రజల కోసం చేసే పనులన్నిటికి వారు అతనికి డబ్బు చెల్లించాల్సి వస్తే, అప్పుడు ఆ దేశం బలహీనంగా ఉంటుంది.
4 Quando o governo é justo, o país tem segurança; mas, quando o governo cobra impostos demais, a nação acaba na desgraça.
5 ఒక వ్యక్తి మనుష్యులకు చక్కని మాటలు చెప్పి తాను కోరింది సంపాదించాలని ప్రయత్నిస్తే, అప్పుడు అతడు తనకు తానే ఒక ఉచ్చు పెట్టుకుంటున్నట్టు అవుతుంది.
5 Quem bajula os seus amigos está armando uma armadilha para si mesmo.
6 దుర్మార్గులు వారి స్వంత పాపం మూలంగానే ఓడించబడతారు. కాని ఒక మంచి మనిషి పాడుతూ సంతోషంగా ఉండగలడు.
6 Os maus são apanhados na armadilha dos seus próprios pecados, mas os honestos andam livres e felizes.
7 మంచి మనుష్యులు పేద ప్రజలకోసం సరైనదానిని చేయాలని కోరుతారు. కాని చేడ్డవాళ్లు ఏమీ పట్టించుకోరు.
7 A pessoa correta se interessa pelos direitos dos pobres, porém os maus não se importam com essas coisas.
8 ఇతరులకంటే మేమే మంచివాళ్లం అనుకొనే మనుష్యులు చాలా చిక్కులు కలిగిస్తారు. వారు మొత్తం పట్టణాలనే గందరగోళం చేయగలరు. కాని జ్ఞానముగల మనుష్యులు శాంతి కలిగిస్తారు.
8 Os que zombam de tudo põem uma cidade inteira em confusão, mas os sábios mantêm tudo em paz.
9 జ్ఞానముగల మనిషి తెలివి తక్కువ వానితో ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఆ తెలివి తక్కువ వాడు వాదం పెట్టుకొని మూర్ఖంగా మాట్లాడుతాడు. ఆ ఇద్దరూ ఎన్నటికీ ఏకీభవించరు.
9 Quando um homem inteligente discute com um tolo, este somente ri, xinga e causa confusão.
10 నరహంతకులు నిజాయితీగల మనుష్యులను ఎల్లప్పుడూ ద్వేషిస్తారు. ఆ దుర్మార్గులు నిజాయితీగల మంచి మనుష్యులను చంపాలని అనుకొంటారు.
10 Os assassinos odeiam as pessoas direitas, mas os bons protegem a vida delas.
11 తెలివితక్కువ వానికి త్వరగా కోపం వస్తుంది. కాని జ్ఞానముగల మనిషి సహాసం కలిగి తనను తాను సంబాళించుకొంటాడు.
11 O tolo mostra toda a sua raiva, mas quem é sensato se cala e a domina.
12 ఒక పాలకుడు అబద్ధాలు వింటే అప్పుడు అతని అధికారులంతా దుర్మార్గులు అవుతారు.
12 Quando um governador dá atenção a mentiras, todos os seus auxiliares acabam se tornando maus.
13 ఒక పేద మనిషి, పేదవాని దగ్గర దొంగిలించే మనిషి ఒక విధంగా ఇద్దరూ ఒకటే. వారిద్దరినీ యెహోవా చేశాడు.
13 O pobre e aquele que o explora só têm uma coisa em comum: o Senhor Deus lhes deu olhos para verem.
14 ఒక రాజు పేదవారి యెడల న్యాయంగా ఉంటే అతడు చాలా కాలం పరిపాలిస్తాడు.
14 As autoridades que defendem o direito dos pobres governam por muito tempo.
15 దెబ్బలు కొట్టటం, ఉపదేశాలు పిల్లలకు మంచివి. ఒక బిడ్డను తన ఇష్టానుసారంగా తల్లిదండ్రులు చేయనిస్తే అప్పుడు ఆ బిడ్డ తన తల్లికి అవమానం తీసికొని వస్తాడు.
15 É bom corrigir e disciplinar a criança. Quando todas as suas vontades são feitas, ela acaba fazendo a sua mãe passar vergonha.
16 దుర్మార్గులు గనుక దేశాన్ని పాలిస్తూంటే, అప్పుడు ఎక్కడ చూసినా పాపమే ఉంటుంది. కాని చివరికి మంచి మనుష్యులు జయిస్తారు.
16 Quando os maus estão no poder, o crime aumenta; mas as pessoas honestas viverão o suficiente para ver a queda dos maus.
17 నీ కుమారుడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు, అప్పుడు వాడిని గూర్చి నీవు ఎల్లప్పుడూ అతిశయిస్తావు. వాడు నిన్ను ఎన్నడూ సిగ్గుపడనియ్యడు.
17 Corrija os seus filhos, e eles serão para você motivo de orgulho e não de vergonha.
18 ఒక దేశం గనుక దేవునిచే నడిపించబడకపోతే అప్పుడు ఆ దేశంలో శాంతి ఉండదు. కానీ దేవుని న్యాయచట్టానికి లోబడే దేశం సంతోషంగా ఉంటుంది.
18 Um país sem a orientação de Deus é um país sem ordem. Quem guarda a lei de Deus é feliz.
19 ఒక సేవకునితో నీవు ఊరక మాటలే చెబితే అతడు పాఠం నేర్చుకోడు. ఆ సేవకుడు నీ మాటలు గ్రహించవచ్చుగాని అతడు లోబడడు.
19 Não adianta nada corrigir um escravo somente com palavras porque, mesmo que ele entenda, não obedecerá.
20 ఒక మనిషి ఆలోచన లేకుండా మాట్లాడితే వానికి ఆశ లేదు. ఆలేచన లేకుండా మాట్లాడే ఒక మనిషికంటే ఒక బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ ఉంది.
20 Há mais esperança para um tolo do que para uma pessoa que fala sem pensar.
21 నీ సేవకునికి కావలసినవి అన్నీ నీవు ఎల్లప్పుడూ ఇస్తూఉంటే చివరికి వాడు మంచి సేవకునిగా ఉండడు.
21 O escravo que é mimado desde criança um dia vai querer ser dono de tudo.
22 కోపంగల మనిషి చిక్కు కలిగిస్తాడు. మరియు కోపపడే మనిషి అనేక పాపాలతో దోషిగా ఉంటాడు.
22 A pessoa de mau gênio sempre causa problemas e discórdias.
23 ఒక మనిషి ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొంటే అదే అతనిని నాశనం చేస్తుంది. కాని ఒక మనిషి వినమ్రంగా ఉంటే అప్పుడు యితరులు అతనిని గౌరవిస్తారు.
23 O orgulhoso acaba sendo humilhado, mas quem é humilde será respeitado.
24 కలిసి పని చేసే ఇద్దరు దొంగలు శత్రువులు. ఒక దొంగ మరో దొంగను బెదిరిస్తాడు. కనుక అతడు సత్యం చేప్పేందుకు న్యాయస్థానంలో బలవంతం చేయబడితే మాట్లాడేందుకు కూడ అతడు ఎంతో భయపడతాడు.
24 O companheiro de um ladrão é o pior inimigo de si mesmo. Se ele disser a verdade no tribunal, será castigado; se não disser, Deus o amaldiçoará.
25 భయం ఒక ఉచ్చులాంటిది. కాని యెహోవాయందు నీవు నమ్మకం ఉంచితే, నీవు క్షేమంగా ఉంటావు.
25 É perigoso ter medo dos outros, mas confiar no Senhor dá segurança.
26 చాలా మంది మనుష్యులు ఒక అధికారికి స్నేహితులుగా ఉండాలని కోరుకొంటారు. కాని ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేవాడు యెహోవా మాత్రమే.
26 Todos querem agradar às pessoas importantes, mas o Senhor dá o que cada um merece.
27 నిజాయితీ లేని మనుష్యులను మంచి మనుష్యులు అసహ్యించుకొంటారు. మరియు దుర్మార్గులు నిజాయితీగల మనుష్యులను అసహ్యించుకొంటారు.
27 Os homens direitos não toleram os maus, e os perversos não toleram os que vivem honestamente.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Provérbios 29, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.