Provérbios 14

హోలీ బైబిల్ (TEL2010) vs VC

Sair da comparação
VC Versão Católica
1 జ్ఞానముగల స్త్రీ తన ఇల్లు ఎలా ఉండాలో అలా చేసుకొనేందుకు జ్ఞానము ప్రయోగిస్తుంది. కానీ బుద్ధిహీనురాలు ఆమె చేసే బుద్ధిహీనమైన పనుల మూలంగా తన ఇల్లు నాశనం చేసికొంటుంది.
1 A senhora Sabedoria edifica sua casa; a senhora Loucura destrói a sua com as próprias mãos.
2 సరిగ్గా జీవించే మనిషి యెహోవాను గౌరవిస్తాడు. కానీ నిజాయితీ లేని మనిషి యెహోవాను ద్వేషిస్తాడు.
2 Quem caminha direito teme o Senhor; o que anda desviado o despreza.
3 బుద్ధిహీనుని మాటలు అతనికి కష్టం తెచ్చిపెడతాయి. కాని జ్ఞానముగలవాని మాటలు అతణ్ణి కాపాడతాయి.
3 A boca do néscio encerra a vara para seu orgulho, mas os lábios do sábio são uma proteção para si mesmo.
4 పని చేయటానికి ఎద్దులు లేకపోతే గాదెలో ధాన్య ముండదు ఒక గొప్ప పంట పండించటానికి మనుష్యులు ఎద్దు బలాన్ని ఉపయోగించవచ్చు.
4 Onde não há bois, a manjedoura está vazia; a abundância da colheita provém da força do gado.
5 సత్యవంతుడు అబద్ధం చెప్పడు. అతడు మంచి సాక్షి. కాని నమ్మదగని వ్యక్తి ఎన్నడూ సత్యం చెప్పడు అతడు చెడ్డ సాక్షి.
5 A testemunha fiel não mente; a testemunha falsa profere falsidades.
6 ఇతరులకంటె తాను మంచివాడను అని తలంచే గర్విష్ఠుడు ఒకవేళ జ్ఞానిగా ఉండాలి అనుకోవచ్చు. కానీ ఆ గర్విష్ఠుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. అయితే నిజంగా జ్ఞానముగల వానికి (దేవుని నమ్మినవానికి) తెలివి సులభంగా అబ్బుతుంది.
6 O mofador busca a sabedoria, mas em vão; ao homem entendido a ciência é fácil.
7 తెలివి తక్కువ వానితో స్నేహం చేయవద్దు. తెలివి తక్కువ మనిషి నీకు నేర్పించగలది ఏమీ లేదు.
7 Afasta-te da presença do tolo: em seus lábios não encontrarás palavras sábias.
8 తెలివిగల మనుష్యులు వారు చేసే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తారు, గనుక వారు జ్ఞానము గలవారు. కానీ బుద్ధిహీనులు మోసం చేసి జీవించవచ్చు. అనుకొంటారు గనుక వారు తెలివితక్కువ వారు.
8 A sabedoria do prudente está no cuidar do seu procedimento; a loucura dos insensatos consiste na fraude.
9 తెలివి తక్కువ వాడు, తాను చేసిన చెడు విషయాలకు శిక్ష పొందాలి అనే మాటను గూర్చి నవ్వేస్తాడు. కానీ మంచి మనుష్యులు క్షమాపణ పొందటానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తారు.
9 O insensato zomba do pecado; a benevolência {de Deus} é para os homens retos.
10 ఒక మనిషి విచారంగా ఉంటే దాని ప్రభావం అతను ఒక్కడే అనుభవిస్తాడు. అదే విధంగా ఒక మనిషి సంతోషంగా ఉంటే అతను ఒక్కడు మాత్రమే ఆ ఆనందం అనుభవిస్తాడు.
10 O coração conhece suas próprias amarguras; o estranho não pode partilhar de sua alegria.
11 దుర్మార్గుని ఇల్లు నాశనం చేయబడుతుంది. కానీ మంచివాని ఇల్లు శాశ్వతంగా ఉంటుంది.
11 A habitação dos pérfidos será destruída, mas a tenda dos justos florescerá.
12 సరిగ్గా ఉంది అని మనుష్యులు తలంచే ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గం మరణానికి మాత్రమే దారి తీస్తుంది.
12 Há caminho que parece reto ao homem; seu fim, porém, é o caminho da morte.
13 ఒక మనిషి నవ్వుతూ ఉన్నా, అతడు విచారంగానే ఉండవచ్చు. నవ్యటం అయిపొయ్యాకగూడ ఆ విచారం అలాగే ఉంటుంది.
13 Mesmo no sorrir, o coração pode estar triste; a alegria pode findar na aflição.
14 దుర్మార్గులు చేసే చెడుపనులకు వారికి పూర్తిగా చెల్లించబడుతుంది (శిక్షించబడుతారు). మరియు మంచివాళ్లు చేసే మంచి పనులకు పూర్తిగా బహుమానం పొందుతారు.
14 O extraviado será saciado com seus próprios erros; o homem de bem, com seus atos.
15 బుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు. కానీ జ్ఞానము గలవాడు ప్రతిదాని గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తాడు.
15 O ingênuo acredita em tudo o que se diz; o prudente vigia seus passos.
16 జ్ఞానముగలవాడు యెహోవాను గౌరవిస్తాడు, దుర్మార్గానికి దూరంగా ఉంటాడు. కానీ బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా పనులు చేస్తాడు జాగ్రత్తగా ఉండడు.
16 O sábio teme o mal e dele se aparta, mas o insensato que se eleva dá-se por seguro.
17 త్వరగా కోపగించుకొనేవాడు బుద్ధిహీనమైన పనులు చేస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఓర్పు కలిగి ఉంటాడు.
17 O homem violento comete loucura; o dissimulado atrai a si o ódio.
18 తెలివితక్కువ వారు తమ తెలివితక్కువ తనాన్ని బట్టి శిక్షించబడుతారు. కానీ జ్ఞానముగలవారికి తెలివి బహుమానంగా ఇవ్వబడుతుంది.
18 Os ingênuos têm por herança a loucura; os prudentes, a ciência como coroa.
19 చివరికి చెడ్డవారిమీద మంచి వాళ్లు గెలుస్తారు. చెడ్డవాళ్లు మంచివాళ్లకు నేవ చేయుటకు బలవంతం చేయబడుతారు.
19 Diante dos bons humilham-se os maus e os ímpios ante as portas do justo.
20 పేదవానికి స్నేహితులు ఎవ్వరూ ఉండరు. అతనికి పొరుగువారు కూడ ఉండరు. కానీ ధనికులకు చాలా మంది స్నేహితులు ఉంటారు.
20 Até mesmo ao seu companheiro o pobre é odioso; numerosos são os amigos do rico.
21 ఇతరులకంటే నీవే మంచివాడవని తలచటం తప్పు. నీవు సంతోషంగా ఉండాలంటే పేదవారి యెడలదయ కలిగి ఉండు.
21 Quem despreza seu próximo comete um pecado; feliz aquele que tem compaixão dos desgraçados.
22 దుర్మార్గం చేయాలనే వ్యక్తి ఎవరైనా సరే అతడు తప్పు చేస్తున్నాడు. అయితే మంచి జరిగించడానికి ప్రయత్నించే వ్యక్తికి, అతన్ని ప్రేమించి అత న్ని నమ్ముకొనే స్నేహితులు ఉంటారు.
22 Porventura não erram os que maquinam o mal? Os que planejam o bem adquirem favor e verdade.
23 నీవు కష్టపడి పని చేస్తే, అప్పుడు నీవు కోరుకొనేవి నీకు ఉంటాయి. కాని నీవు మాట్లాడటం తప్ప పని ఏమి చేయకపోతే నీవు పేదవానివిగా ఉంటావు.
23 Para todo esforço há fruto, muito palavrório só produz penúria.
24 జ్ఞానముగలవారు ఐశ్వర్యాన్ని బహుమానంగా పొందుతారు. కాని బుద్ధిహీనులు తెలివితక్కువ తనాన్ని బహుమానంగా పొందుతారు.
24 Para o sábio a riqueza é uma coroa. A loucura dos insensatos permanece loucura.
25 సత్యం పలికే మనిషి ఇతరులకు సహాయం చేస్తాడు. అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులకు హాని చేస్తాడు.
25 A testemunha fiel salva vidas; o que profere mentiras é falso.
26 యెహోవాను గౌరవించే మనిషి క్షేమంగా ఉంటాడు. మరియు అతని పిల్లలు క్షేమంగా జీవిస్తారు.
26 No temor do Senhor {o justo} encontra apoio sólido; seus filhos nele encontrarão abrigo.
27 యెహోవా యెడల భక్తి నిజమైన జీవాన్ని ప్రసాదిస్తుంది. అది ఒక వ్యక్తిని మరణవు ఉచ్చునుండి రక్షిస్తుంది.
27 O temor do Senhor é uma fonte de vida para escapar aos laços da morte.
28 ఒక రాజు అనేకమంది ప్రజలను పాలిస్తే అతడు గొప్పవాడు. కాని ప్రజలు ఎవ్వరూ లేకపోతే అప్పుడు ఆ రాజు యొక్క విలువ శూన్యం.
28 A multidão do povo é a glória de um rei; a falta de população é a ruína de um príncipe.
29 సహనంగల మనిషి చాలా తెలివిగలవాడు. త్వరగా కోపపడు మనిషి బుద్ధిహీనుడని కనపరచుకుంటాడు.
29 O paciente dá prova de bom senso; quem se arrebata rapidamente manifesta sua loucura.
30 ఒక మనిషి మనస్సులో శాంతి ఉంటే అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అసూయ శరీరంలో వ్యాధి కలిగిస్తుంది.
30 Um coração tranqüilo é a vida do corpo, enquanto a inveja é a cárie dos ossos.
31 పేద ప్రజలకు కష్టాలు కలిగించే మనిషి దేవుణ్ణి గౌరవించటం లేదని చూపెడతాడు. ఇద్దరినీ దేవుడే చేశాడు. కాని ఒక మనిషి పేద ప్రజల యెడల దయ కలిగి ఉంటే, అప్పుడు అతడు దేవుని గౌరవిస్తాడు.
31 O opressor do pobre ultraja seu criador, mas honra-o o que se compadece do indigente.
32 కష్టకాలంలో దుర్మార్గులు ఓడించబడతారు. కాని మంచివాళ్లు మరణ సమయంలో కూడా విజయం పొందుతారు.
32 É por causa de sua própria malícia que cai o ímpio; o justo, porém, até na morte conserva a confiança.
33 జ్ఞానముగల మనిషి ఎల్లప్పుడూ జ్ఞానముగల విషయాలే తలుస్తాడు. కాని బుద్ధిహీనునిక జ్ఞానమును గూర్చి అసలు ఏమీ తెలియదు.
33 No coração do prudente repousa a sabedoria. Entre os tolos ela se fará conhecer?
34 మంచితనం ఒక దేశాన్ని గొప్పగా చేస్తుంది. కాని పాపం వలన ఏ ప్రజలకైనా అవమానమే కలుగుతుంది.
34 A justiça enaltece uma nação; o pecado é a vergonha dos povos.
35 ఒక రాజుకు జ్ఞానముగల నాయకులు ఉంటే అతడు సంతోషిస్తాడు. కాని తెలివితక్కువ నాయకుల విషయమై రాజుకు కోపం.
35 O servidor inteligente goza do favor do rei, mas a sua ira fere o desonrado.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Provérbios 14, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.