Salmos 79

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.
1 Salmo de Asafe. Ó Deus, os pagãos chegaram à tua herança; teu santo templo eles contaminaram; eles reduziram Jerusalém a montões.
2 వారు నీ సేవకుల కళేబరములను ఆకాశపక్షులకు ఎర గాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి యున్నారు.
2 Os cadáveres dos teus servos eles deram para que servissem de alimento para as aves do céu, a carne dos teus santos aos animais da terra.
3 ఒకడు నీళ్లుపోసినట్లు యెరూషలేముచుట్టు వారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టువారెవరును లేరు.
3 Seu sangue eles derramaram como água ao redor de Jerusalém; e não houve ninguém que os enterrasse.
4 మా పొరుగువారికి మేము అసహ్యులమైతివిు మా చుట్టునున్నవారు మమ్ము నపహసించి యెగతాళి చేసెదరు.
4 Nos tornamos uma vergonha para nossos vizinhos, um desdém e um escárnio para aqueles que nos cercam.
5 యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడును కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా?
5 Por quanto tempo, SENHOR? Ficarás zangado para sempre? Queimará o teu ciúme como o fogo?
6 నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము.
6 Derrama a tua ira sobre os pagãos que não conheceram a ti, e sobre os reinos que não chamaram o teu nome.
7 వారు యాకోబు సంతతిని మింగివేసియున్నారు వారి నివాసమును పాడుచేసియున్నారు
7 Pois eles devoraram Jacó, e devastaram sua habitação.
8 మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము
8 Não te lembres contra nós iniquidades passadas; que as tuas tenras misericórdias nos impeçam rapidamente; pois fomos levados para muito baixo.
9 మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.
9 Ajuda-nos, ó Deus da nossa salvação, para a glória do teu nome; livra-nos, purga os nossos pecados, por causa do teu nome.
10 వారి దేవుడెక్కడ నున్నాడని అన్యజనులు పలుక నేల? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్త మునుగూర్చిన ప్రతి దండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము.
10 Portanto diriam os pagãos: Onde está o seu Deus? Seja ele conhecido entre os pagãos à nossa vista, pela vingança do sangue dos teus servos que é derramado.
11 చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము.
11 Venha diante de ti os suspiros do prisioneiro; segundo a grandeza do teu poder, preserva aqueles que são designados para morrer;
12 ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి యెదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము.
12 e retribui aos nossos vizinhos sete vezes no seu peito a sua vergonha, com a qual eles te envergonharam, ó Senhor.
13 అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.
13 Assim nós, teu povo e ovelhas do teu pasto, daremos graças para sempre; mostraremos o teu louvor a todas as gerações.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 79, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.