Salmos 69
Telugu Bible (GL_TELUGU) vs ARC
1 దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.
1 Livra-me, ó Deus, pois as águas entraram até à minha alma.
2 నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.
2 Atolei-me em profundo lamaçal, onde se não pode estar em pé; entrei na profundeza das águas, onde a corrente me leva.
3 నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను.
3 Estou cansado de clamar; secou-se-me a garganta; os meus olhos desfalecem esperando o meu Deus.
4 నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.
4 Aqueles que me aborrecem sem causa são mais do que os cabelos da minha cabeça; aqueles que procuram destruir-me sendo injustamente meus inimigos, são poderosos; então, restituí o que não furtei.
5 దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
5 Tu, ó Deus, bem conheces a minha insipiência; e os meus pecados não te são encobertos.
6 ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన అవమానము నొంద నియ్యకుము.
6 Não sejam envergonhados por minha causa aqueles que esperam em ti, ó Senhor, Senhor dos Exércitos; não sejam confundidos por minha causa aqueles que te buscam, ó Deus de Israel.
7 నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.
7 Porque por amor de ti tenho suportado afronta; a confusão cobriu o meu rosto.
8 నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.
8 Tenho-me tornado como um estranho para com os meus irmãos, e um desconhecido para com os filhos de minha mãe.
9 నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.
9 Pois o zelo da tua casa me devorou, e as afrontas dos que te afrontam caíram sobre mim.
10 ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను.
10 Chorei, e castiguei com jejum a minha alma, mas até isto se me tornou em afrontas.
11 నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని.
11 Pus, por veste, um pano de saco e me fiz um provérbio para eles.
12 గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.
12 Aqueles que se assentam à porta falam contra mim; sou a canção dos bebedores de bebida forte.
13 యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.
13 Eu, porém, faço a minha oração a ti, Senhor , num tempo aceitável; ó Deus, ouve-me segundo a grandeza da tua misericórdia, segundo a verdade da tua salvação.
14 నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము.
14 Tira-me do lamaçal e não me deixes atolar; seja eu livre dos que me aborrecem e das profundezas das águas.
15 నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము.
15 Não me leve a corrente das águas e não me sorva o abismo, nem o poço cerre a sua boca sobre mim.
16 యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.
16 Ouve-me, Senhor , pois boa é a tua misericórdia; olha para mim segundo a tua muitíssima piedade.
17 నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.
17 E não escondas o teu rosto do teu servo, porque estou angustiado; ouve-me depressa.
18 నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము.
18 Aproxima-te da minha alma, e resgata-a; livra-me por causa dos meus inimigos.
19 నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెననినీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.
19 Bem conheces a minha afronta, e a minha vergonha, e a minha confusão; diante de ti estão todos os meus adversários.
20 నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవ రును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.
20 Afrontas me quebrantaram o coração, e estou fraquíssimo; esperei por alguém que tivesse compaixão, mas não houve nenhum; e por consoladores, mas não os achei.
21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.
21 Deram-me fel por mantimento, e na minha sede me deram a beber vinagre.
22 వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక.
22 Torne-se a sua mesa diante dele em laço e, para sua inteira recompensa, em ruína.
23 వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.
23 Escureçam-se-lhes os olhos, para que não vejam, e faze com que os seus lombos tremam constantemente.
24 వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
24 Derrama sobre eles a tua indignação, e prenda-os o ardor da tua ira.
25 వారి పాళెము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక
25 Fique desolado o seu palácio; e não haja quem habite nas suas tendas.
26 నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
26 Pois perseguem a quem afligiste e conversam sobre a dor daqueles a quem feriste.
27 దోషముమీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము.
27 Acrescenta iniquidade à iniquidade deles, e não entrem na tua justiça.
28 జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.
28 Sejam riscados do livro da vida e não sejam inscritos com os justos.
29 నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక.
29 Eu, porém, estou aflito e triste; ponha-me a tua salvação, ó Deus, num alto retiro.
30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను
30 Louvarei o nome de Deus com cântico e engrandecê-lo-ei com ação de graças.
31 ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము
31 Isto será mais agradável ao Senhor do que o boi ou bezerro que tem pontas e unhas.
32 బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక.
32 Os mansos verão isto e se agradarão; o vosso coração viverá, pois que buscais a Deus.
33 యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు.
33 Porque o Senhor ouve os necessitados e não despreza os seus cativos.
34 భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.
34 Louvem-no os céus e a terra, os mares e tudo quanto neles se move.
35 దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.
35 Porque Deus salvará a Sião e edificará as cidades de Judá, para que habitem ali e a possuam.
36 ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు కొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివ సించెదరు.
36 E herdá-la-á a semente de seus servos, e os que amam o seu nome habitarão nela.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Salmos 69, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.