Salmos 37
Telugu Bible (GL_TELUGU) vs NVT
1 చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము.
1 Não se preocupe com os perversos, nem tenha inveja dos que praticam o mal.
2 వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు
2 Pois, como o capim, logo secarão e, como a grama verde, logo murcharão.
3 యెహోవాయందు నమి్మకయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము
3 Confie no S enhor e faça o bem, e você viverá seguro na terra e prosperará.
4 యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
4 Busque no S enhor a sua alegria, e ele lhe dará os desejos de seu coração.
5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.
5 Entregue seu caminho ao S enhor ; confie nele, e ele o ajudará.
6 ఆయన వెలుగునువలె నీ నీతిని మధ్యాహ్నమునువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును.
6 Tornará sua inocência radiante como o amanhecer, e a justiça de sua causa, como o sol do meio-dia.
7 యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
7 Aquiete-se na presença do S enhor , espere nele com paciência. Não se preocupe com o perverso que prospera, nem se aborreça com seus planos maldosos.
8 కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము
8 Deixe a ira de lado! Não se enfureça! Não perca a calma; isso só lhe trará prejuízo.
9 కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.
9 Pois os perversos serão destruídos, mas os que confiam no S
10 ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.
10 Em breve, o perverso desaparecerá; ainda que o procure, não o encontrará.
11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు
11 Os humildes possuirão a terra e viverão em paz e prosperidade.
12 భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారినిచూచి పండ్లు కొరుకుదురు.
12 O perverso trama contra o justo; rosna e lhe mostra os dentes.
13 వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచు చున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
13 Mas o Senhor ri, pois vê que o dia do julgamento se aproxima.
14 దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి యున్నారు
14 Os perversos puxam suas espadas e preparam seus arcos, para matar o pobre e o oprimido, para massacrar os que são corretos.
15 వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.
15 Suas espadas, porém, lhes atravessarão o próprio coração, e seus arcos serão quebrados.
16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
16 Melhor ser justo e ter pouco que ser perverso e rico.
17 భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు
17 Pois a força dos perversos será despedaçada, mas o S
18 నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.
18 A cada dia, o S enhor cuida dos íntegros; eles receberão uma herança que dura para sempre.
19 ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరవు దినములలో వారు తృప్తిపొందుదురు.
19 Em tempos de calamidade, não serão envergonhados; mesmo em dias de fome, terão mais que o suficiente.
20 భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి యుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.
20 Os perversos, contudo, morrerão; os inimigos do S e desaparecerão como fumaça.
21 భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.
21 O perverso toma emprestado e nunca paga, mas o justo dá com generosidade.
22 యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించినవారు నిర్మూలమగుదురు.
22 Aqueles a quem o S enhor abençoa possuirão a terra, mas aqueles a quem amaldiçoa serão destruídos.
23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
23 O S enhor dirige os passos do justo; ele se agrada de quem anda em seu caminho.
24 యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.
24 Ainda que tropece, não cairá, pois o S
25 నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
25 Fui jovem e agora sou velho, mas nunca vi o justo ser abandonado, nem seus filhos mendigarem pão.
26 దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపువారు ఆశీర్వదింపబడుదురు.
26 O justo é generoso e empresta de boa vontade, e seus filhos são uma bênção.
27 కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు
27 Afaste-se do mal e faça o bem, e você viverá na terra para sempre.
28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్న టెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.
28 Pois o S enhor ama a justiça e jamais abandonará seu povo fiel. Ele sempre os protegerá, mas os filhos dos perversos serão destruídos.
29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.
29 Os justos possuirão a terra e nela habitarão para sempre.
30 నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.
30 O justo oferece conselhos sábios e ensina o que é certo.
31 వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.
31 Guarda no coração a lei de Deus, por isso seus passos são firmes.
32 భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.
32 O perverso fica à espreita do justo e procura matá-lo.
33 వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషు లుగా ఎంచడు.
33 O S enhor , porém, não deixará que o perverso tenha sucesso, nem condenará o justo quando ele for julgado.
34 యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
34 Ponha sua esperança no S enhor e ande com firmeza pelo caminho dele. Ele o honrará e lhe dará a terra, e você verá os perversos serem destruídos.
35 భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను.
35 Vi pessoas más e cruéis florescerem como árvores em solo nativo.
36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
36 Mas, quando voltei a olhar, tinham desaparecido; procurei por elas, mas não as encontrei.
37 నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు
37 Observe os que são íntegros e justos; um futuro maravilhoso espera os que amam a paz.
38 భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము
38 Os rebeldes, porém, serão destruídos de uma só vez; não têm futuro algum.
39 బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక
39 O S enhor salva os justos; ele é sua fortaleza em tempos de aflição.
40 ఆయన భక్తిహీనుల చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును.
40 O S enhor os socorre e os livra dos perversos. Ele os salva, porque nele se refugiam.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Salmos 37, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.