Salmos 34

Telugu Bible (GL_TELUGU) vs VC

Sair da comparação
VC Versão Católica
1 నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
1 De Davi. Quando simulou alienação na presença de Abimelec e, despedido por ele, partiu. Bendirei continuamente ao Senhor, seu louvor não deixará meus lábios.
2 యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.
2 Glorie-se a minha alma no Senhor; ouçam-me os humildes, e se alegrem.
3 నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.
3 Glorificai comigo ao Senhor, juntos exaltemos o seu nome.
4 నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.
4 Procurei o Senhor e ele me atendeu, livrou-me de todos os temores.
5 వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.
5 Olhai para ele a fim de vos alegrardes, e não se cobrir de vergonha o vosso rosto.
6 ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.
6 Vede, este miserável clamou e o Senhor o ouviu, de todas as angústias o livrou.
7 యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
7 O anjo do Senhor acampa em redor dos que o temem, e os salva.
8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
8 Provai e vede como o Senhor é bom, feliz o homem que se refugia junto dele.
9 యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.
9 Reverenciai o Senhor, vós, seus fiéis, porque nada falta àqueles que o temem.
10 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.
10 Os poderosos empobrecem e passam fome, mas aos que buscam o Senhor nada lhes falta.
11 పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.
11 Vinde, meus filhos, ouvi-me: eu vos ensinarei o temor do Senhor.
12 బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా డెవడైన నున్నాడా?
12 Qual é o homem que ama a vida, e deseja longos dias para gozar de felicidade?
13 చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము.
13 Guarda tua língua do mal, e teus lábios das palavras enganosas.
14 కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.
14 Aparta-te do mal e faze o bem, busca a paz e vai ao seu encalço.
15 యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.
15 Os olhos do Senhor estão voltados para os justos, e seus ouvidos atentos aos seus clamores.
16 దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.
16 O Senhor volta a sua face irritada contra os que fazem o mal, para apagar da terra a lembrança deles.
17 నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.
17 Apenas clamaram os justos, o Senhor os atendeu e os livrou de todas as suas angústias.
18 విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.
18 O Senhor está perto dos contritos de coração, e salva os que têm o espírito abatido.
19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపిం చును.
19 São numerosas as tribulações do justo, mas de todas o livra o Senhor.
20 ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.
20 Ele protege cada um de seus ossos, nem um só deles será quebrado.
21 చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచ బడుదురు
21 A malícia do ímpio o leva à morte, e os que odeiam o justo serão castigados.
22 యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధు లుగా ఎంచబడరు.
22 O Senhor livra a alma de seus servos; não será punido quem a ele se acolhe.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 34, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.