Salmos 107

Telugu Bible (GL_TELUGU) vs VC

Sair da comparação
VC Versão Católica
1 యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
1 Aleluia. Louvai o Senhor, porque ele é bom. Porque eterna é a sua misericórdia.
2 యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును
2 Assim o dizem aqueles que o Senhor resgatou, aqueles que ele livrou das mãos do opressor,
3 తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక.
3 assim como os que congregou de todos os países, do oriente e do ocidente, do norte e do sul.
4 వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడు చుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను.
4 Erravam na solidão do deserto, sem encontrar caminho de cidade habitável.
5 ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.
5 Consumidos de fome e de sede, sentiam desfalecer-lhes a vida.
6 వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
6 Em sua angústia clamaram então para o Senhor, ele os livrou de suas tribulações
7 వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను.
7 e os conduziu pelo bom caminho, para chegarem a uma cidade habitável.
8 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక
8 Agradeçam ao Senhor por sua bondade, e por suas grandes obras em favor dos homens,
9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.
9 porque dessedentou a garganta sequiosa, e cumulou de bens a que tinha fome.
10 దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
10 Outros estavam nas trevas e na sombra da morte, prisioneiros na miséria e em ferros,
11 బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును
11 por se haverem revoltado contra as ordens de Deus e terem desprezado os desígnios do Altíssimo.
12 ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.
12 Pelo sofrimento lhes humilhara o coração, sucumbiam sem que ninguém os socorresse.
13 కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను
13 Em sua angústia clamaram então para o Senhor, e ele os livrou de suas tribulações.
14 వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.
14 Tirou-os das trevas e da sombra da morte, quebrou-lhes os grilhões.
15 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
15 Agradeçam ao Senhor por sua bondade, e por suas grandes obras em favor dos homens.
16 ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.
16 Ele arrombou as portas de bronze, e despedaçou os ferrolhos de ferro.
17 బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు.
17 Outros, enfermos por causa de seu mau proceder, eram feridos por causa de seus pecados.
18 భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్య మగును వారు మరణద్వారములను సమీపించుదురు.
18 Todo alimento lhes causava náuseas, chegaram às portas da morte.
19 కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
19 Em sua angústia clamaram então para o Senhor; ele os livrou de suas tribulações.
20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
20 Enviou a sua palavra para os curar, para os arrancar da morte.
21 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయుఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
21 Agradeçam ao Senhor por sua bondade, e por suas grandes obras em favor dos homens.
22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక.
22 Ofereçam sacrifícios de ação de graças, e proclamem alegremente as suas obras.
23 ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయు వారు
23 Os que se fizeram ao mar, para trafegar nas muitas águas,
24 యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.
24 foram testemunhas das obras do Senhor e de suas maravilhas no alto-mar.
25 ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను
25 Sua palavra levantou tremendo vento, que impeliu para o alto as suas ondas.
26 వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.
26 Subiam até os céus, desciam aos abismos, suas almas definhavam em angústias.
27 మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.
27 Titubeavam e cambaleavam como ébrios, e toda a sua perícia se esvaiu.
28 శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
28 Em sua agonia clamaram então ao Senhor, e ele os livrou da tribulação.
29 ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.
29 Transformou a procela em leve brisa, e as ondas do mar silenciaram.
30 అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.
30 E se alegraram porque elas amainaram, e os conduziu ao desejado porto.
31 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
31 Agradeçam eles ao Senhor por sua bondade, e por suas grandes obras em favor dos homens.
32 జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక
32 Celebrem-no na assembléia do povo, e o louvem no conselho dos anciãos.
33 దేశనివాసుల చెడుతనమునుబట్టి
33 Transformou rios em deserto, e fontes de água em terra árida.
34 ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.
34 Converteu o solo fértil em salinas, por causa da malícia de seus habitantes.
35 అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి
35 Mudou o deserto em lençol de água, e a terra árida em abundantes fontes.
36 వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి
36 Aí fez habitar os esfaimados, que fundaram uma cidade para morar.
37 వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనినవారిని అచ్చట కాపురముంచెను
37 E semearam os campos e plantaram vinhas, colhendo deles abundantes frutos.
38 మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక ముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు
38 E os abençoou: eles se multiplicaram grandemente, e lhes concedeu rebanhos numerosos.
39 వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు
39 Depois seu número se reduziu e caíram na miséria, sob a opressão, a desgraça e o sofrimento.
40 రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు.
40 Mas aquele que lança seu desprezo sobre os grandes, e os faz errar por ínvios desertos,
41 అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.
41 {Deus,} soergueu o pobre da miséria, multiplicando famílias como rebanhos.
42 యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు.
42 À vista disso os justos se alegram, e toda a maldade deve fechar a boca.
43 బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును యెహోవా కృపాతిశయములను జనులు తల పోయు దురుగాక.
43 Quem é sábio para julgar estas coisas e compreender as misericórdias do Senhor?

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 107, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.