Salmos 102

Telugu Bible (GL_TELUGU) vs ACF

Sair da comparação
ACF Almeida Corrigida Fiel
1 యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.
1 SENHOR, ouve a minha oração, e chegue a ti o meu clamor.
2 నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము.
2 Não escondas de mim o teu rosto no dia da minha angústia, inclina para mim os teus ouvidos; no dia em que eu clamar, ouve-me depressa.
3 పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.
3 Porque os meus dias se consomem como a fumaça, e os meus ossos ardem como lenha.
4 ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.
4 O meu coração está ferido e seco como a erva, por isso me esqueço de comer o meu pão.
5 నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ మునకు అంటుకొని పోయినవి.
5 Por causa da voz do meu gemido os meus ossos se apegam à minha pele.
6 నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను.
6 Sou semelhante ao pelicano no deserto; sou como um mocho nas solidões.
7 రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను.
7 Vigio, sou como o pardal solitário no telhado.
8 దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపిం తురు.
8 Os meus inimigos me afrontam todo o dia; os que se enfurecem contra mim têm jurado contra mim.
9 నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.
9 Pois tenho comido cinza como pão, e misturado com lágrimas a minha bebida,
10 నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొను చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు.
10 Por causa da tua ira e da tua indignação, pois tu me levantaste e me arremessaste.
11 నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.
11 Os meus dias são como a sombra que declina, e como a erva me vou secando.
12 యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరము లుండును.
12 Mas tu, Senhor, permanecerás para sempre, a tua memória de geração em geração.
13 నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను.
13 Tu te levantarás e terás piedade de Sião; pois o tempo de te compadeceres dela, o tempo determinado, já chegou.
14 దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు
14 Porque os teus servos têm prazer nas suas pedras, e se compadecem do seu pó.
15 అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు
15 Então os gentios temerão o nome do Senhor, e todos os reis da terra a tua glória.
16 ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
16 Quando o Senhor edificar a Sião, aparecerá na sua glória.
17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
17 Ele atenderá à oração do desamparado, e não desprezará a sua oração.
18 యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు
18 Isto se escreverá para a geração futura; e o povo que se criar louvará ao Senhor.
19 మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు నట్లు
19 Pois olhou desde o alto do seu santuário, desde os céus o Senhor contemplou a terra,
20 చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును
20 Para ouvir o gemido dos presos, para soltar os sentenciados à morte;
21 ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు
21 Para anunciarem o nome do Senhor em Sião, e o seu louvor em Jerusalém,
22 వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును
22 Quando os povos se ajuntarem, e os reinos, para servirem ao Senhor.
23 నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను.
23 Abateu a minha força no caminho; abreviou os meus dias.
24 నేనీలాగు మనవిచేసితిని నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును.
24 Dizia eu: Meu Deus, não me leves no meio dos meus dias, os teus anos são por todas as gerações.
25 ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే.
25 Desde a antiguidade fundaste a terra, e os céus são obra das tuas mãos.
26 అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.
26 Eles perecerão, mas tu permanecerás; todos eles se envelhecerão como um vestido; como roupa os mudarás, e ficarão mudados.
27 నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
27 Porém tu és o mesmo, e os teus anos nunca terão fim.
28 నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.
28 Os filhos dos teus servos continuarão, e a sua semente ficará firmada perante ti.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 102, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.