Provérbios 15
Telugu Bible (GL_TELUGU) vs NAA
1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.
1 A resposta branda desvia o furor, mas a palavra dura suscita a ira.
2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
2 A língua dos sábios adorna o conhecimento, mas a boca dos insensatos derrama tolices.
3 యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.
3 Os olhos do Senhor estão em todo lugar, contemplando os maus e os bons.
4 సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.
4 A língua serena é árvore de vida, mas a língua perversa esmaga o espírito.
5 మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.
5 O insensato despreza a instrução de seu pai, mas o que aceita a repreensão consegue a prudência.
6 నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.
6 Na casa do justo há grande tesouro, mas no lucro dos ímpios há infelicidade.
7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
7 As palavras dos sábios difundem o conhecimento, mas o coração dos insensatos não procede assim.
8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయ ములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
8 O Senhor detesta o sacrifício dos ímpios, mas a oração dos retos é o seu prazer.
9 భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును.
9 O Senhor detesta o caminho do ímpio, mas ama o que segue a justiça.
10 మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.
10 Disciplina rigorosa há para o que abandona o caminho, e quem odeia a repreensão morrerá.
11 పాతాళమును అగాధకూపమును యెహోవాకు కన బడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కన బడును గదా?
11 O mundo dos mortos e o abismo estão expostos diante do quanto mais o coração dos filhos dos homens!
12 అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.
12 O zombador não gosta de quem o repreende, nem se aproxima dos sábios.
13 సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
13 O coração alegre embeleza o rosto, mas com a tristeza do coração o espírito se abate.
14 బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు.
14 O coração sábio busca o conhecimento, mas a boca dos insensatos se alimenta de estupidez.
15 బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.
15 Para quem está aflito, todos os dias são maus, mas a vida de quem tem o coração alegre é uma festa contínua.
16 నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.
16 Melhor é o pouco, havendo o temor do do que um grande tesouro onde há inquietação.
17 పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
17 Melhor é um prato de legumes onde há amor do que um boi inteiro acompanhado de ódio.
18 కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
18 Quem se irrita facilmente provoca discórdia, mas quem é tardio em ficar irado acalma os conflitos.
19 సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
19 O caminho do preguiçoso é como que cercado de espinhos, mas a vereda dos justos é plana.
20 జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.
20 O filho sábio alegra o seu pai, mas o insensato despreza a sua mãe.
21 బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.
21 Quem não tem juízo se alegra com a sua tolice, mas quem é sábio anda retamente.
22 ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థ మగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
22 Sem conselhos os projetos fracassam, mas com muitos conselheiros há sucesso.
23 సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతో షము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!
23 Que alegria é ter a resposta adequada! Como é boa a palavra dita na hora certa!
24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును
24 Para o sábio, o caminho da vida leva para cima, para desviar do inferno, embaixo.
25 గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.
25 O Senhor derruba a casa dos orgulhosos, mas preserva a herança da viúva.
26 దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.
26 O Senhor detesta os planos dos maus, mas as palavras bondosas lhe são aprazíveis.
27 లోభి తన యింటివారిని బాధపెట్టును లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును.
27 Quem é ávido por lucro desonesto arruína a sua casa, mas o que odeia o suborno, esse viverá.
28 నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చు టకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును
28 O coração do justo medita o que há de responder, mas a boca dos ímpios derrama maldades.
29 భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.
29 O Senhor está longe dos ímpios, mas ouve a oração dos justos.
30 కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును.
30 O brilho nos olhos alegra o coração; uma boa notícia fortalece até os ossos.
31 జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును.
31 Quem dá ouvidos à repreensão construtiva terá a sua morada no meio dos sábios.
32 శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీక రించును గద్దింపును వినువాడు వివేకియగును.
32 Quem rejeita a disciplina despreza a si mesmo, mas o que aceita a repreensão adquire entendimento.
33 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.
33 O temor do Senhor é instrução na sabedoria, e a humildade precede a honra.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Provérbios 15, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.