Naum 1
Telugu Bible (GL_TELUGU) vs BKJ
1 నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూ మునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.
1 O peso de Nínive. O livro da visão de Naum, o elcosita.
2 యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయు వాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.
2 O SENHOR é Deus ciumento e vingador; o SENHOR vinga-se e é cheio de furor; o SENHOR toma vingança contra os seus adversários, e reserva a ira contra os seus inimigos.
3 యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.
3 O SENHOR é tardio em irar-se, e grande em poder, e não irá de forma alguma absolver o perverso; o SENHOR tem o seu caminho no vendaval e na tempestade, e as nuvens são o pó dos seus pés.
4 ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడి పోవును లెబానోను పుష్పము వాడిపోవును.
4 Ele repreende o mar, e o faz secar, e esgota todos os rios; desfalecem Basã e o Carmelo, e a flor do Líbano murcha.
5 ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.
5 Os montes estremecem diante dele, e as colinas derretem; a terra é queimada em sua presença; sim, o mundo, e todos os que nele habitam.
6 ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
6 Quem pode resistir diante da sua indignação? E quem permanecerá diante do ardor da sua ira? A sua fúria é derramada como fogo, e por ele as rochas são derrubadas.
7 యెహోవా ఉత్త ముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమి్మకయుంచువారిని ఆయన ఎరుగును.
7 O SENHOR é bom, uma fortaleza no dia da dificuldade; ele conhece os que confiam nele.
8 ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,
8 Mas com uma inundação transbordante ele dará um fim absoluto ao seu lugar, e as trevas perseguirão os seus inimigos.
9 యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.
9 Que imaginais vós contra o SENHOR? Ele vos consumirá por completo; a aflição não se levantará uma segunda vez.
10 ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.
10 Ainda que eles se entrelacem como espinhos, e se encham de bebida como bêbados, serão devorados como palha seca.
11 నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైనవాటిని బోధించినవా డొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.
11 Há um que saiu de ti, e que maquinou o mal contra o SENHOR, um conselheiro perverso.
12 యెహోవా సెలవిచ్చునదేమనగావారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూల మగుదురు; నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.
12 Assim diz o SENHOR: Embora sejam quietos e em grande número, ainda assim serão exterminados, e ele passará; ainda que eu tenha te afligido, não te afligirei mais.
13 వారి కాడిమ్రాను నీమీద ఇక మోప కుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.
13 Mas agora quebrarei o seu jugo de sobre ti, e romperei os teus laços.
14 నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చు నదేమనగానీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియు లేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.
14 E o SENHOR deu ordem a teu respeito, que não haja mais linhagem do teu nome; da casa dos teus deuses exterminarei a imagem de escultura e a imagem de fundição; eu farei a tua sepultura, pois és vil.
15 సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లిం పుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.
15 Eis sobre os montes os pés do que traz as boas novas, do que anuncia a paz! Ó Judá, guarda as tuas festas solenes, e cumpre os teus votos; pois o perverso não passará mais por ti; ele é inteiramente exterminado.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Naum 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.