Lucas 22
Telugu Bible (GL_TELUGU) vs ARIB
1 పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీ పించెను.
1 Aproximava-se a festa dos pães ázimos, que se chama a páscoa.
2 ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపా యము వెదకుచుండిరి.
2 E os principais sacerdotes e os escribas andavam procurando um modo de o matar; pois temiam o povo.
3 అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవే శించెను
3 Entrou então Satanás em Judas, que tinha por sobrenome Iscariotes, que era um dos doze;
4 గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధాన యాజ కులతోను అధిపతులతోను మాటలాడెను.
4 e foi ele tratar com os principais sacerdotes e com os capitães de como lho entregaria.
5 అందుకు వారు సంతో షించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
5 Eles se alegraram com isso, e convieram em lhe dar dinheiro.
6 వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
6 E ele concordou, e buscava ocasião para lho entregar sem alvoroço.
7 పస్కాపశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా
7 Ora, chegou o dia dos pães ázimos, em que se devia imolar a páscoa;
8 యేసు పేతురును యోహానును చూచిమీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.
8 e Jesus enviou a Pedro e a João, dizendo: Ide, preparai-nos a páscoa, para que a comamos.
9 వారుమేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా
9 Perguntaram-lhe eles: Onde queres que a preparemos?
10 ఆయనఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి
10 Respondeu-lhes: Quando entrardes na cidade, sair-vos-á ao encontro um homem, levando um cântaro de água; segui-o até a casa em que ele entrar.
11 నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి.
11 E direis ao dono da casa: O Mestre manda perguntar-te: Onde está o aposento em que hei de comer a páscoa com os meus discípulos?
12 అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధ పరచుడని వారితో చెప్పెను.
12 Então ele vos mostrará um grande cenáculo mobiliado; aí fazei os preparativos.
13 వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
13 Foram, pois, e acharam tudo como lhes dissera e prepararam a páscoa.
14 ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి.
14 E, chegada a hora, pôs-se Jesus à mesa, e com ele os apóstolos.
15 అప్పుడాయన నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.
15 E disse-lhes: Tenho desejado ardentemente comer convosco esta páscoa, antes da minha paixão;
16 అది దేవుని రాజ్య ములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి
16 pois vos digo que não a comerei mais até que ela se cumpra no reino de Deus.
17 ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిమీరు దీనిని తీసి కొని మీలో పంచుకొనుడి;
17 Então havendo recebido um cálice, e tendo dado graças, disse: Tomai-o, e reparti-o entre vós;
18 ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పు చున్నాననెను.
18 porque vos digo que desde agora não mais beberei do fruto da videira, até que venha o reino de Deus.
19 పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తు తులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాప కము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.
19 E tomando pão, e havendo dado graças, partiu-o e deu-lho, dizendo: Isto é o meu corpo, que é dado por vós; fazei isto em memória de mim.
20 ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టు కొనిఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.
20 Semelhantemente, depois da ceia, tomou o cálice, dizendo: Este cálice é o novo pacto em meu sangue, que é derramado por vós.
21 ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది.
21 Mas eis que a mão do que me trai está comigo à mesa.
22 నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవు చున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను.
22 Porque, na verdade, o Filho do homem vai segundo o que está determinado; mas ai daquele homem por quem é traído!
23 వారుఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొన సాగిరి.
23 Então eles começaram a perguntar entre si qual deles o que ia fazer isso.
24 తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా
24 Levantou-se também entre eles contenda, sobre qual deles parecia ser o maior.
25 ఆయన వారితో ఇట్లనెను అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉప కారులనబడుదురు.
25 Ao que Jesus lhes disse: Os reis dos gentios dominam sobre eles, e os que sobre eles exercem autoridade são chamados benfeitores.
26 మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను.
26 Mas vós não sereis assim; antes o maior entre vós seja como o mais novo; e quem governa como quem serve.
27 గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు వానివలె ఉన్నాను.
27 Pois qual é maior, quem está à mesa, ou quem serve? porventura não é quem está à mesa? Eu, porém, estou entre vós como quem serve.
28 నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే;
28 Mas vós sois os que tendes permanecido comigo nas minhas provações;
29 గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని,
29 e assim como meu Pai me conferiu domínio, eu vo-lo confiro a vós;
30 సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియ మించుచున్నాను.
30 para que comais e bebais à minha mesa no meu reino, e vos senteis sobre tronos, julgando as doze tribos de Israel.
31 సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని
31 Simão, Simão, eis que Satanás vos pediu para vos cirandar como trigo;
32 నీ నమి్మక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
32 mas eu roguei por ti, para que a tua fé não desfaleça; e tu, quando te converteres, fortalece teus irmãos.
33 అయితే అతడు ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా
33 Respondeu-lhe Pedro: Senhor, estou pronto a ir contigo tanto para a prisão como para a morte.
34 ఆయనపేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను.
34 Tornou-lhe Jesus: Digo-te, Pedro, que não cantará hoje o galo antes que três vezes tenhas negado que me conheces.
35 మరియు ఆయనసంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారుఏమియు తక్కువకాలేదనిరి.
35 E perguntou-lhes: Quando vos mandei sem bolsa, alforje, ou alparcas, faltou-vos porventura alguma coisa? Eles responderam: Nada.
36 అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను; కత్తి లేనివాడు తన బట్టనమి్మ కత్తి కొనుక్కొనవలెను;
36 Disse-lhes pois: Mas agora, quem tiver bolsa, tome-a, como também o alforje; e quem não tiver espada, venda o seu manto e compre-a.
37 ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను
37 Porquanto vos digo que importa que se cumpra em mim isto que está escrito: E com os malfeitores foi contado. Pois o que me diz respeito tem seu cumprimento.
38 అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను.
38 Disseram eles: Senhor, eis aqui duas espadas. Respondeu-lhes: Basta.
39 వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా--చాలునని ఆయన వారితో చెప్పెను.
39 Então saiu e, segundo o seu costume, foi para o Monte das Oliveiras; e os discípulos o seguiam.
40 తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి.
40 Quando chegou àquele lugar, disse-lhes: Orai, para que não entreis em tentação.
41 ఆ చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవే శించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి
41 E apartou-se deles cerca de um tiro de pedra; e pondo-se de joelhos, orava,
42 వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని
42 dizendo: Pai, se queres afasta de mim este cálice; todavia não se faça a minha vontade, mas a tua.
43 తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను.
43 Então lhe apareceu um anjo do céu, que o confortava.
44 అప్పుడు పర లోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.
44 E, posto em agonia, orava mais intensamente; e o seu suor tornou-se como grandes gotas de sangue, que caíam sobre o chão.
45 ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.
45 Depois, levantando-se da oração, veio para os seus discípulos, e achou-os dormindo de tristeza;
46 ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి
46 e disse-lhes: Por que estais dormindo? Lenvantai-vos, e orai, para que não entreis em tentação.
47 మీరెందుకు నిద్రించు చున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను.
47 E estando ele ainda a falar, eis que surgiu uma multidão; e aquele que se chamava Judas, um dos doze, ia adiante dela, e chegou-se a Jesus para o beijar.
48 ఆయన ఇంకను మాటలాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పండ్రెండుమందిలో యూదా అన బడినవాడు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా
48 Jesus, porém, lhe disse: Judas, com um beijo trais o Filho do homem?
49 యేసు యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించు చున్నావా అని వానితో అనగా
49 Quando os que estavam com ele viram o que ia suceder, disseram: Senhor, feri-los-emos a espada?
50 ఆయన చుట్టుఉన్న వారు జరుగబోవు దానిని చూచిప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి.
50 Então um deles feriu o servo do sumo sacerdote, e cortou-lhe a orelha direita.
51 అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను.
51 Mas Jesus disse: Deixei-os; basta. E tocando-lhe a orelha, o curou.
52 అయితే యేసుఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.
52 Então disse Jesus aos principais sacerdotes, oficiais do templo e anciãos, que tinham ido contra ele: Saístes, como a um salteador, com espadas e varapaus?
53 యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోనుమీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా?
53 Todos os dias estava eu convosco no templo, e não estendestes as mãos contra mim; mas esta é a vossa hora e o poder das trevas.
54 నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను.
54 Então, prendendo-o, o levaram e o introduziram na casa do sumo sacerdote; e Pedro seguia-o de longe.
55 వారాయనను పట్టి యీడ్చుకొనిపోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూర ముగా వారి వెనుక వచ్చుచుండెను.
55 E tendo eles acendido fogo no meio do pátio e havendo-se sentado à roda, sentou-se Pedro entre eles.
56 అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండి నప్పుడు, పేతురును వారి మధ్యను కూర్చుండెను.
56 — ausente —
57 అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచివీడును అతనితో కూడ ఉండెనని చెప్పెను.
57 Mas Pedro o negou, dizendo: Mulher, não o conheço.
58 అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను.
58 Daí a pouco, outro o viu, e disse: Tu também és um deles. Mas Pedro disse: Homem, não sou.
59 మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచినీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను.
59 E, tendo passado quase uma hora, outro afirmava, dizendo: Certamente este também estava com ele, pois é galileu.
60 ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడునిజముగా వీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను.
60 Mas Pedro respondeu: Homem, não sei o que dizes. E imediatamente estando ele ainda a falar, cantou o galo.
61 అందుకు పేతురుఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను.
61 Virando-se o Senhor, olhou para Pedro; e Pedro lembrou-se da palavra do Senhor, como lhe havia dito: Hoje, antes que o galo cante, três vezes me negarás.
62 అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురునేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసిక
62 E, havendo saído, chorou amargamente.
63 వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.
63 Os homens que detinham Jesus zombavam dele, e feriam-no;
64 యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి,
64 e, vendando-lhe os olhos, perguntavam, dizendo: Profetiza, quem foi que te bateu?
65 నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగిఒ ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
65 E, blasfemando, diziam muitas outras coisas contra ele.
66 ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసికొనిపోయి
66 Logo que amanheceu reuniu-se a assembléia dos anciãos do povo, tanto os principais sacerdotes como os escribas, e o conduziam ao sinédrio deles, onde lhe disseram:
67 నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయననేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు.
67 Se tu és o Cristo, dize-no-lo. Replicou-lhes ele: Se eu vo-lo disser, não o crereis;
68 అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.
68 e se eu vos interrogar, de modo algum me respondereis.
69 ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.
69 Mas desde agora estará assentado o Filho do homem à mão direita do poder de Deus.
70 అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయనమీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
70 Ao que perguntaram todos: Logo, tu és o Filho de Deus? Respondeu-lhes: Vós dizeis que eu sou.
71 అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి.
71 Então disseram: Por que ainda temos necessidade de testemunho? pois nós mesmos o ouvimos da sua própria boca.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Lucas 22, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.