Josué 22

Telugu Bible (GL_TELUGU) vs VC

Sair da comparação
VC Versão Católica
1 యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపువారిని పిలిపించి వారితో ఇట్లనెను
1 Josué convocou os rubenitas, os gaditas e a meia tribo de Manassés:
2 యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు.
2 Observastes, disse-lhes ele, tudo o que vos ordenou Moisés, servo do Senhor, e obedecestes a todos os mandamentos que vos dei.
3 బహుదినములనుండి నేటివరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచి యున్నారు.
3 Durante todo esse tempo, até o dia de hoje, não abandonastes vossos irmãos, observando fielmente o mandamento do Senhor, vosso Deus.
4 ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి యున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకు డైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్లుడి.
4 Agora que o Senhor, vosso Deus, deu aos vossos irmãos o descanso que ele havia prometido, retomai o caminho de vossas tendas na terra que vos pertence, e que Moisés, servo do Senhor, vos deu além do Jordão.
5 అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవు డైన యెహోవాను ప్రేమించుచు, ఆయనమార్గములన్ని టిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్ర మును అనుసరించి నడుచుకొనుడి.
5 Tende muito cuidado, no entanto, de pôr em prática os mandamentos e as leis que vos prescreveu Moisés, servo do Senhor: amar o Senhor, vosso Deus, andar em todos os seus caminhos, guardar os seus mandamentos e unir-vos a ele, servindo de todo o vosso coração e de toda a vossa alma.
6 అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాస ములకు పోయిరి.
6 Josué abençoou-os e os despediu, e eles voltaram para as suas tendas.
7 మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటిదిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యము లిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను
7 Ora, Moisés tinha dado a uma meia tribo de Manassés uma parte em Basã; por isso Josué deu à outra meia tribo uma parte entre seus irmãos ao ocidente, aquém do Jordão. Despedindo-os para as suas tendas, Josué deu-lhes esta bênção:
8 మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతివిస్తారమైన వస్త్రము లతోను తిరిగి మీ నివాసములకు వెళ్లుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులును కలిసి పంచుకొనుడి.
8 Voltais para vossas tendas com grandes riquezas - numerosos rebanhos, prata e ouro, bronze e ferro, e vestidos em grande quantidade - e reparti com vossos irmãos os despojos de vossos inimigos.
9 కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాటచొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్యభూమి యైన గిలాదులోనికి వెళ్లుటకు కనాను దేశమందలి షిలో హులోనున్న ఇశ్రాయేలీయుల యొద్దనుండి బయలుదేరిరి. కనానుదేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు
9 Os filhos de Rubem, de Gad e da meia tribo de Manassés separaram-se dos israelitas em Silo, na terra de Canaã, e retomaram o caminho da terra de Galaad, terra cuja propriedade tinha recebido por mandamento do Senhor, transmitido a Moisés.
10 రూబేనీయు లును గాదీయులును మనష్షే అర్థ గోత్రపువారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠ మును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే.
10 E, tendo chegado aos distritos do Jordão, que pertencem à terra de Canaã, os filhos de Rubem, de Gad, da meia tribo de Manassés levantaram, ali junto ao Jordão, um enorme altar, que se podia ver de longe.
11 అప్పుడు రూబే నీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల యెదుటివైపున యొర్దానుప్రదేశ ములో కనానుదేశము నెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రా యేలీయులకు వర్తమానము వచ్చెను.
11 Os israelitas, tendo ouvido que os filhos de Rubem, de Gad e da meia tribo de Manassés tinham levantado um altar defronte da terra de Canaã, na região do Jordão do lado dos israelitas,
12 ​ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి
12 reuniram-se todos em Silo para irem combater contra eles.
13 ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారి యొద్దకును యాజకు డగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి.
13 Enviaram aos filhos de Rubem, de Gad e da meia tribo de Manassés, na terra de Galaad, o sacerdote Finéias, filho de Eleazar,
14 ఇశ్రాయేలీయుల గోత్రముల న్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని, అనగా పదిమంది ప్రధానులను అతనితో కూడ పంపిరి, వారందరు ఇశ్రాయేలీయుల సమూ హములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు.
14 juntamente com dez príncipes, chefes de casas patriarcais, um chefe por tribo, sendo todos chefes de casas patriarcais entre os milhares de Israel.
15 వారు గిలాదుదేశములోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారి యొద్ద కును పోయి వారితో ఇట్లనిరి
15 Estes, chegando junto aos filhos de Rubem, de Gad e da meia tribo de Manassés, na terra de Galaad, disseram-lhes:
16 యెహోవా సర్వ సమాజపువారు చెప్పుచున్నదేమనగానేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయు చున్నారు?
16 Eis a mensagem da assembléia do Senhor: que infidelidade é essa que cometeis contra o Deus de Israel, desviando-vos hoje do Senhor e levantando um altar, o que é presentemente um ato de revolta contra ele?
17 పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజ ములో తెగులు పుట్టెను గదా నేటివరకు మనము దానినుండి పవిత్రపరచుకొనకయున్నాము.
17 Porventura não nos basta o pecado de Fogor, do qual ainda hoje não estamos purificados, apesar do castigo que feriu a assembléia do Senhor? E vós vos desviais hoje do Senhor!
18 మీరు ఈ దిన మున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగ బడి ద్రోహము చేసెదరేమి? ఆలాగైతె ఆయన ఇకమీదట ఇశ్రాయేలీయుల సర్వసమా జముమీద కోపపడును గదా?
18 Se vos revoltais hoje contra o Senhor, amanhã sua cólera se inflamará contra toda a assembléia de Israel.
19 ​మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్ర ముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలి పీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి,
19 Se julgais que a terra de vossa herança é impura, passai para a terra que é a propriedade do Senhor, onde se acha sua morada, e instalai-vos no meio de nós; mas não vos revolteis contra o Senhor, nem contra nós, construindo outro altar além do altar do Senhor, nosso Deus.
20 ​జెరహు కుమారుడైన ఆకాను ప్రతి ష్ఠితమైన దానివిషయములో తిరుగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీదికి కోపము రాలేదా? తన దోషమువలన ఆ మనుష్యుడొకడే మరణ మాయెనా?
20 Não houve uma explosão de cólera do Senhor contra toda a assembléia de Israel quando Acã, filho de Zaré, pecou contra o que estava votado ao interdito? E não foi só ele que pereceu por causa de seu crime.
21 ​అందుకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా
21 Os filhos de Rubem, de Gad e da meia tribo de Manassés responderam aos chefes dos milhares de Israel:
22 దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలి యును, ఇశ్రాయేలీయులు తెలిసి కొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగు బాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.
22 Deus todo-poderoso, o Senhor Deus todo-poderoso, o Senhor sabe, e Israel o saiba: se foi por espírito de revolta e por infidelidade para com o Senhor, que ele não nos poupe neste dia!...
23 యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్య మునైనను దానిమీద అర్పించుటకే గాని సమా ధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితివిు.
23 Se foi para desviar-nos do Senhor que levantamos um altar, e se foi para oferecermos sobre ele holocaustos, oblações e sacrifícios de ações de graças, o Senhor mesmo nos peça conta disso!
24 ఏమనగా రాబోవుకాలమున మీ సంతానపు వారు మా సంతానపువారితోఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము?
24 Se o fizemos, foi antes por temor de que vossos filhos digam um dia aos nossos: Que tendes vós em comum com o Senhor, o Deus de Israel?
25 రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతా నపువారు మా సంతానపువా రిని యెహోవా విషయములో భయభక్తులులేని వార గునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితివిు.
25 O Senhor pôs o rio Jordão como fronteira entre nós e vós, ó filhos de Rubem e de Gad: não tendes parte com o Senhor. E desse modo vossos filhos poderiam afastar os nossos do culto do Senhor.
26 ​కాబట్టి మేముమనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలుల నర్పించుటకైనను బలి నర్పిం చుటకైనను కాదు.
26 Por isso combinamos entre nós: construamos um altar, não para holocaustos e sacrifícios,
27 ​మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకుయెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండు నట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును.
27 mas para que seja um testemunho entre nós e vós, entre os nossos filhos e os vossos, de que prestamos culto ao Senhor em sua presença, oferecendo-lhe nossos holocaustos, nossos sacrifícios e nossas ações de graças, e para que os vossos filhos não digam amanhã aos nossos: vós não tendes parte com o Senhor.
28 ​అందుకు మేముఇకమీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పినయెడల మేముమన పిత రులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి; యిది దహనబలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదుగాని, మాకును మీకును మధ్యసాక్షియై యుండుటకే యని చెప్పుదమని అనుకొంటిమి.
28 Se, pois, amanhã eles nos falassem assim, a nós ou aos nossos descendentes, poderíamos responder-lhes: vede a forma do altar do Senhor que nossos pais construíram, não para holocaustos e sacrifícios, mas para servir de testemunho entre nós e vós.
29 ​ఆయన మందిరము నెదుట నున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలి పీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగి పోయినయెడల నేమి యెహోవామీద ద్రోహము చేసినయెడల నేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక.
29 Longe de nós o pensamento de querer revoltar-nos contra o Senhor, desviando-nos hoje dele por termos construído um altar para holocaustos, oblações e sacrifícios, fora do altar que está diante da morada do Senhor, nosso Deus!
30 ​ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులును, అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులును రూబేనీయులును గాదీయులును మనష్షీయులును చెప్పిన మాటలను విని సంతోషించిరి.
30 Tendo ouvido as palavras dos filhos de Rubem, de Gad e da meia tribo de Manassés, o sacerdote Finéias e os príncipes da assembléia, chefes dos milhares de Israel que o acompanhavam, deram-se por satisfeitos.
31 ​అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోను గాదీయులతోను మనష్షీయులతోనుమీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము; ఇప్పుడు మీరు యెహోవా చేతిలోనుండి ఇశ్రాయేలీయులను విడిపించి యున్నారని చెప్పెను.
31 Então o sacerdote Finéias, filho de Eleazar, disse aos filhos de Rubem, de Gad e de Manassés: Reconhecemos hoje que o Senhor está no meio de nós, visto que não cometestes esse pecado contra ele, e salvastes assim os israelitas da mão do Senhor!
32 యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహా సును ప్రధానులును గిలాదులోని రూబేనీయుల యొద్దనుండియు, గాదీయుల యొద్దనుండియు ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా
32 O sacerdote Finéias, filho de Eleazar, deixando os filhos de Rubem e de Gad, voltou com os príncipes da terra de Galaad para a terra de Canaã, para junto dos israelitas, e fez-lhes um relatório de tudo.
33 ​ఇశ్రా యేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి, రూబేనీయులును గాదీయులును నివసించు దేశమును పాడుచేయుటకు వారిమీద యుద్ధము చేయుట మానిరి.
33 Alegraram-se com isso, bendisseram a Deus e não pensaram mais em sair contra eles para devastar a terra habitada pelos filhos de Rubem e de Gad.
34 ​రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను సాక్షియగు నని దానికి ఏద అను పేరు పెట్టిరి.
34 Por isso os filhos de Rubem e de Gad chamaram ao altar que tinham construído Ed, porque, disseram eles, ele é testemunho entre nós de que o Senhor é o verdadeiro Deus.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Josué 22, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.