Jeremias 25

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబు లోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
1 A palavra que veio a Jeremias a respeito de todo o povo de Judá, no quarto ano de Jeoiaquim, o filho de Josias, rei de Judá, que foi o primeiro ano de Nabucodonosor, rei de Babilônia.
2 ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరి తోను యెరూషలేము నివాసులందరితోను ఆ వాక్కును ప్రకటించెను.
2 A qual Jeremias, o profeta, falou para todo o povo de Judá, e para todos os habitantes de Jerusalém, dizendo:
3 ఆమోను కుమారుడును యూదారాజు నైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.
3 Desde o décimo terceiro ano de Josias, o filho de Amom, rei de Judá, até este dia, período de vinte e três anos, a palavra do SENHOR tem vindo até mim, e eu tenho falado para vós, madrugando e falando. Porém vós não tendes escutado.
4 మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయు టయు మాని,
4 E o SENHOR vos enviou todos os servos, os profetas, madrugando e os enviando, porém vós não escutastes, nem inclinastes o vosso ouvido para ouvir.
5 మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగినయెడల, యెహోవా మీకును మీ పితరులకును నిత్యనివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై,
5 Eles disseram: Convertei-vos de seu mau caminho, e do mal de vossos feitos, e habitai na terra que o SENHOR vos deu, e a vossos pais, para sempre e sempre.
6 ​యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.
6 E não andeis após outros deuses para os servir, e para os adorar, e não me provoqueis à ira com as obras de vossas mãos, e eu não vos farei mal.
7 అయితేమీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
7 Contudo vós não me escutastes, diz o SENHOR, mas me provocastes à ira com as obras de vossas mãos, para vosso próprio mal.
8 ​సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువ నంపించుచున్నాను;
8 Portanto, assim diz o SENHOR dos Exércitos: Porque vós não ouvistes minhas palavras;
9 ​ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మ యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
9 eis que eu enviarei e tomarei todas as famílias do norte, diz o SENHOR, e Nabucodonosor, o rei de Babilônia, meu servo, e os trarei contra esta terra, e contra os seus habitantes, e contra todas estas nações ao redor, e as destruirei completamente, e as farei um assombro, e um assobio, e desolações perpétuas.
10 ​సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వర మును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండ కుండ చేసెదను.
10 Além disso, eu lhes tomarei a voz de regozijo, e a voz de júbilo, a voz do noivo, e a voz da noiva, o som das pedras de moinho, e a luz da vela.
11 ​ఈ దేశమంతయు పాడుగాను నిర్జనము గాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబు లోనురాజునకు దాసులుగా ఉందురు.
11 E esta terra inteira será uma desolação, e um assombro. E estas nações servirão ao rei de Babilônia por setenta anos.
12 యెహోవా వాక్కు ఇదేడెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జను లను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.
12 E acontecerá que, quando setenta anos forem completados, que eu punirei o rei de Babilônia, e aquela nação, diz o SENHOR, pela sua iniquidade, e a terra dos caldeus, e a farei desolações perpétuas.
13 ​నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నియు యిర్మీయా ఈ జనము లన్నిటినిగూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయ బడినదంతయు ఆ దేశముమీదికి రప్పించెదను.
13 E eu trarei sobre aquela terra todas as minhas palavras, que eu tenho pronunciado contra ela, e tudo o que está escrito neste livro, que Jeremias profetizou contra todas as nações.
14 ఏల యనగా నేను వారి క్రియలనుబట్టియు వారి చేతి కార్య ములనుబట్టియు వారికి ప్రతికారముచేయునట్లు అనేక జనములును మహారాజులును వారిచేత సేవ చేయించు కొందురు.
14 Pois também deles se servirão muitas nações e grandes reis. E eu os recompensarei conforme seus feitos, e conforme as obras das suas próprias mãos.
15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెల విచ్చుచున్నాడునీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనము లన్నిటికి దాని త్రాగింపుము.
15 Porque assim me diz o SENHOR Deus de Israel: Pega da minha mão a taça do vinho da ira, e darás a beber a todas as nações, a quem eu te enviar.
16 వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.
16 E elas beberão, e serão abaladas, enlouquecerão por causa da espada que eu enviarei entre eles.
17 అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.
17 Então tomei eu a taça da mão do SENHOR, e fiz todas as nações beberem, a quem o SENHOR tinha enviado a mim;
18 నేటివలెనే పాడు గాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదము గాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణము లకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగిం చితిని.
18 a saber, Jerusalém, e as cidades de Judá, e aos seus reis, e aos seus príncipes, para fazê-los uma desolação, um assombro, um assobio, e uma maldição, como é neste dia.
19 ​మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసు లును అతని ప్రధానులును అతని జనులందరును
19 A Faraó, rei do Egito, e aos seus servos, e aos seus príncipes, e a todo o seu povo;
20 ​సమస్త మైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలి ష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజ యును, ఎక్రోనును అష్డోదు శేషపువారును
20 e a todo o povo misto, e a todos os reis da terra de Uz, e a todos os reis da terra dos filisteus, e a Asquelom, e a Gaza, e a Ecrom, e ao remanescente de Asdode;
21 ఎదోమీయు లును మోయాబీయులును అమ్మోనీయులును
21 Edom, a Moabe, e aos filhos de Amom,
22 తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును
22 e a todos os reis de Tiro, e a todos os reis de Sidom, e aos reis das ilhas que estão além do mar,
23 దదానీయులును తేమానీయు లును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొనువా రందరును
23 Dedã, e a Tema, e a Buz, e a todos que estão nos mais remotos lugares,
24 అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
24 e a todos os reis da Arábia, e a todos os reis do povo misto que habita no deserto,
25 జిమీ రాజు లందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులంద రును
25 e a todos os reis de Zinri, e a todos os reis de Elão, e a todos os reis da Média,
26 సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవా రేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు; షేషకురాజు వారి తరువాత త్రాగును.
26 e a todos os reis do norte, distantes e próximos, um com o outro, e a todos os reinos do mundo, que estão sobre a face da terra, e o rei de Sesaque beberá após eles.
27 నీవు వారితో ఈలాగు చెప్పుముఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనే యుండి మీరు మరల లేవకుండ పడు దురు.
27 Portanto tu lhes dirás: Assim diz o SENHOR dos Exércitos, o Deus de Israel: Bebei, e embebedai-vos, e vomitai, e caí, e não levantai mais, por causa da espada que eu enviarei entre vós.
28 మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుముమీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధి పతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
28 E será que, se eles se recusarem a pegar a taça de tua mão para beber, então tu lhes dirás: Assim diz o SENHOR dos Exércitos: Vós certamente bebereis.
29 నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించు చున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.
29 Porque eis que eu começo a trazer o mal sobre a cidade que é chamada pelo meu nome, e deveríeis estar completamente impunes? Vós não estareis impunes, pois eu irei requerer uma espada sobre todos os habitantes da terra, diz o SENHOR dos Exércitos.
30 కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రక టించి, ఈలాగు చెప్పవలెనుఉన్నత స్థలములోనుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు, ద్రాక్షగానుగను త్రొక్కువారివలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికి విరోధముగా ఆర్భటించు చున్నాడు.
30 Portanto profetiza contra eles todas estas palavras, e dize-lhes: O SENHOR irá rugir desde o alto, e pronunciará a sua voz desde a sua santa habitação. Ele irá poderosamente rugir sobre a sua habitação. Ele dará um brado, como aqueles que pisam as uvas, contra todos os habitantes da terra.
31 భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరు లందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టు లను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు.
31 Um barulho chegará até os confins da terra, pois o SENHOR tem uma controvérsia com as nações. Ele debaterá com toda a carne. Ele dará aqueles que são perversos à espada, diz o SENHOR.
32 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుజనమునుండి జనమునకు కీడు వ్యాపించు చున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళ్లుచున్నది.
32 Assim diz o SENHOR dos Exércitos: Eis que o mal sairá de nação para nação, e um grande furacão será levantado desde as fronteiras da terra.
33 ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.
33 E serão os mortos do SENHOR, naquele dia, desde uma extremidade da terra até a outra extremidade da terra. Eles não serão lamentados, nem reunidos, nem enterrados. Eles serão esterco sobre o chão.
34 మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దిన ములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు.
34 Gemei, vós pastores, e chorai. E revolvei-vos nas cinzas, vós principais do rebanho, pois os dias de vossa matança e de vossas dispersões estão acabados, e vós caireis como um vaso precioso.
35 మందకాపరు లకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్ఠ మైన వాటికి రక్షణ దొరకకపోవును,
35 E os pastores não terão caminho para fugir, nem os principais do rebanho para escapar.
36 ఆలకించుడి, మంద కాపరుల మొఱ్ఱ వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోలవినబడుచున్నది, యెహోవా వారి మేతభూమినిపాడు చేసియున్నాడు.
36 Uma voz de grito dos pastores, e um gemido dos principais do rebanho, será ouvida, pois o SENHOR destruiu o pasto deles.
37 ​నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను;
37 E as pacíficas habitações estão derrubadas por causa da violenta ira do SENHOR.
38 ​క్రూరమైన ఖడ్గముచేతను ఆయన కోపాగ్నిచేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను.
38 Ele abandonou o seu abrigo, como o leão, porque a sua terra está desolada por causa da ferocidade do opressor, e por causa da sua violenta ira.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 25, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.