Jó 31
Telugu Bible (GL_TELUGU) vs NAA
1 నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?
1 “Fiz uma aliança com os meus olhos: de não olhar para uma virgem.
2 ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును?ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?
2 Do contrário, qual seria a minha porção do Deus lá de cima, e que herança receberia do Todo-Poderoso desde as alturas?
3 దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.
3 Por acaso, não é a perdição para o ímpio, e a desgraça para os que praticam a maldade?
4 ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా
4 Será que Deus não vê os meus caminhos e não conta todos os meus passos?
5 అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల
5 Se andei com falsidade ou se o meu pé se apressou para o engano
6 నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు
6 — que Deus me pese numa balança justa e conhecerá a minha integridade!”
7 న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల
7 “Se os meus passos se desviaram do caminho, se o meu coração segue os meus olhos, e se alguma mancha se apegou às minhas mãos,
8 నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక.
8 então que outros comam o que eu semeei, e que seja arrancado o que se produz no meu campo.
9 నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల
9 Se o meu coração se deixou seduzir por uma mulher, se fiquei rondando a porta do meu próximo,
10 నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.
10 então que a minha mulher moa os cereais para outro homem, e que outros se deitem com ela.
11 అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము
11 Pois eu teria cometido um crime hediondo, um delito a ser punido pelos juízes.
12 అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.
12 Isso seria fogo que consome até a destruição e arrancaria toda a minha colheita pela raiz.”
13 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల
13 “Se não reconheci o direito do meu servo ou da minha serva quando eles reclamavam contra mim,
14 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?
14 então que faria eu quando Deus se levantasse no tribunal? E, se ele me interrogasse, que lhe responderia eu?
15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.
15 Aquele que me formou no ventre de minha mãe não os fez também a eles? Ou não é o mesmo Deus que nos formou no ventre materno?”
16 బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను
16 “Se retive o que os pobres desejavam ou deixei que os olhos das viúvas esperassem em vão;
17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను
17 ou, se sozinho comi o meu bocado, sem reparti-lo com os órfãos
18 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను
18 — porque desde a minha mocidade eu os criei como se fosse pai deles, durante toda a minha vida fui o guia das viúvas —;
19 వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను
19 se vi alguém perecer por falta de roupa ou notava que o necessitado não tinha com que se cobrir;
20 గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను
20 se ele não me agradeceu do fundo do coração, quando se aquecia com a lã dos meus cordeiros;
21 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.
21 se eu levantei a mão contra o órfão, sabendo que eu tinha o apoio dos juízes,
22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను.నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.
22 então que a omoplata caia do meu ombro, e que o meu braço seja arrancado da articulação.
23 దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
23 Porque o castigo de Deus seria para mim um assombro, e eu não poderia enfrentar a sua majestade.”
24 సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను
24 “Se no ouro pus a minha esperança ou se eu disse ao ouro fino: ‘Você é a minha garantia’;
25 నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను
25 se me alegrei por ser grande a minha riqueza e por ter a minha mão alcançado muito;
26 సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి
26 se olhei para o sol, quando resplandecia, ou para a lua, que caminhava em seu esplendor,
27 నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.
27 e o meu coração se deixou seduzir em segredo, e eu lhes atirei beijos com a mão,
28 అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
28 também isto seria um delito a ser punido pelos juízes, pois eu teria negado a Deus, que está lá em cima.”
29 నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
29 “Se me alegrei com a desgraça do que me odeia e se exultei quando o mal o atingiu
30 నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
30 — eu que não deixei a minha boca pecar, rogando praga para que morresse —;
31 అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను
31 se as pessoas que moram na minha tenda não disseram: ‘Quem nos dera encontrar alguém que não se saciou da carne provida por ele’
32 పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.
32 — pois o estrangeiro não pernoitava na rua; as minhas portas estavam sempre abertas para os viajantes! —;
33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని
33 se, como Adão, encobri as minhas transgressões, ocultando a minha iniquidade em meu íntimo,
34 మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును
34 porque eu tinha medo da grande multidão, e o desprezo das famílias me apavorava, fazendo com que eu me calasse e não saísse da porta…”
35 నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.
35 “Quem dera que eu tivesse quem me ouvisse! Eis aqui a minha defesa assinada! Que o Todo-Poderoso me responda! Que o meu adversário escreva a sua acusação!
36 నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి కొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.
36 Por certo que a levaria sobre o meu ombro, e a poria sobre mim como se fosse uma coroa.
37 నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయనయొద్దకు వెళ్లెదను.
37 Eu lhe mostraria o número dos meus passos; como príncipe eu me aproximaria dele.”
38 నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల
38 “Se a minha terra clamar contra mim, e se os seus sulcos juntamente chorarem;
39 క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను
39 se comi os seus frutos sem pagar ou se causei a morte aos seus donos,
40 గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.
40 que ela produza espinhos em vez de trigo, e joio em lugar de cevada.” Fim das palavras de Jó.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Jó 31, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.