Jó 22

Telugu Bible (GL_TELUGU) vs ARA

Sair da comparação
ARA Almeida Revista e Atualizada 1993
1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను
1 Então, respondeu Elifaz, o temanita:
2 నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు;బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు
2 Porventura, será o homem de algum proveito a Deus? Antes, o sábio é só útil a si mesmo.
3 నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా?నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభ కరమా?
3 Ou tem o Todo-Poderoso interesse em que sejas justo ou algum lucro em que faças perfeitos os teus caminhos?
4 ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునా?నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా?
4 Ou te repreende pelo teu temor de Deus ou entra contra ti em juízo?
5 నీ చెడుతనము గొప్పది కాదా?నీ దోషములు మితిలేనివి కావా?
5 Porventura, não é grande a tua malícia, e sem termo, as tuas iniquidades?
6 ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివివస్త్రహీనుల బట్టలను తీసికొంటివి
6 Porque sem causa tomaste penhores a teu irmão e aos seminus despojaste das suas roupas.
7 దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివిఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.
7 Não deste água a beber ao cansado e ao faminto retiveste o pão.
8 బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించునుఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును.
8 Ao braço forte pertencia a terra, e só os homens favorecidos habitavam nela.
9 విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివితండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.
9 As viúvas despediste de mãos vazias, e os braços dos órfãos foram quebrados.
10 కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవిఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది.
10 Por isso, estás cercado de laços, e repentino pavor te conturba
11 నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా?నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా?
11 ou trevas, em que nada vês; e águas transbordantes te cobrem.
12 దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి?
12 Porventura, não está Deus nas alturas do céu? Olha para as estrelas mais altas. Que altura!
13 దేవునికి ఏమి తెలియును?గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా?
13 E dizes: Que sabe Deus? Acaso, poderá ele julgar através de densa escuridão?
14 గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి,ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.
14 Grossas nuvens o encobrem, de modo que não pode ver; ele passeia pela abóbada do céu.
15 పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?
15 Queres seguir a rota antiga, que os homens iníquos pisaram?
16 వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.
16 Estes foram arrebatados antes do tempo; o seu fundamento, uma torrente o arrasta.
17 ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
17 Diziam a Deus: Retira-te de nós. E: Que pode fazer-nos o Todo-Poderoso?
18 మాయొద్దనుండి తొలగిపొమ్మనియుసర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు.భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక.
18 Contudo, ele enchera de bens as suas casas. Longe de mim o conselho dos perversos!
19 మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియువారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు
19 Os justos o veem e se alegram, e o inocente escarnece deles,
20 నీతిమంతులు దాని చూచి సంతోషించుదురునిర్దోషులు వారిని హేళనచేయుదురు.
20 dizendo: Na verdade, os nossos adversários foram destruídos, e o fogo consumiu o resto deles.
21 ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును.
21 Reconcilia-te, pois, com ele e tem paz, e assim te sobrevirá o bem.
22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుముఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.
22 Aceita, peço-te, a instrução que profere e põe as suas palavras no teu coração.
23 సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలోనుండి దుర్మార్గమును దూరముగాతొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.
23 Se te converteres ao Todo-Poderoso, serás restabelecido; se afastares a injustiça da tua tenda
24 మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణ మును పారవేయుము
24 e deitares ao pó o teu ouro e o ouro de Ofir entre pedras dos ribeiros,
25 అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును.
25 então, o Todo-Poderoso será o teu ouro e a tua prata escolhida.
26 అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.
26 Deleitar-te-ás, pois, no Todo-Poderoso e levantarás o rosto para Deus.
27 నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.
27 Orarás a ele, e ele te ouvirá; e pagarás os teus votos.
28 మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.
28 Se projetas alguma coisa, ela te sairá bem, e a luz brilhará em teus caminhos.
29 నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును.
29 Se estes descem, então, dirás: Para cima! E Deus salvará o humilde
30 నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.
30 e livrará até ao que não é inocente; sim, será libertado, graças à pureza de tuas mãos.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 22, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.