Jó 18

Telugu Bible (GL_TELUGU) vs ACF

Sair da comparação
ACF Almeida Corrigida Fiel
1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను
1 Então respondeu Bildade, o suíta, e disse:
2 మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు?మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.
2 Até quando poreis fim às palavras? Considerai bem, e então falaremos.
3 మీ దృష్టికి మృగములుగానుమూఢులుగాను మేమెంచబడుట ఏల?
3 Por que somos tratados como animais, e como imundos aos vossos olhos?
4 కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా,నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా?నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?
4 Oh tu, que despedaças a tua alma na tua ira, será a terra deixada por tua causa? Remover-se-ão as rochas do seu lugar?
5 భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.
5 Na verdade, a luz dos ímpios se apagará, e a chama do seu fogo não resplandecerá.
6 వారి గుడారములో వెలుగు అంధకారమగునువారియొద్దనున్న దీపము ఆరిపోవును
6 A luz se escurecerá nas suas tendas, e a sua lâmpada sobre ele se apagará.
7 వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడునువారి స్వకీయాలోచన వారిని కూల్చును.
7 Os seus passos firmes se estreitarão, e o seu próprio conselho o derrubará.
8 వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.
8 Porque por seus próprios pés é lançado na rede, e andará nos fios enredados.
9 బోను వారి మడిమెను పట్టుకొనునువల వారిని చిక్కించుకొనును.
9 O laço o apanhará pelo calcanhar, e a armadilha o prenderá.
10 వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడునువారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.
10 Está escondida debaixo da terra uma corda, e uma armadilha na vereda.
11 నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయునుభయములు వారిని వెంటాడి తరుమును.
11 Os assombros o espantarão de todos os lados, e o perseguirão a cada passo.
12 వారి బలము క్షీణించిపోవునువారిని కూల్చుటకు ఆపద కాచియుండును.
12 Será faminto o seu vigor, e a destruição está pronta ao seu lado.
13 అది వారి దేహ అవయవములను భక్షించునుమరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును.
13 Serão devorados os membros do seu corpo; sim, o primogênito da morte devorará os seus membros.
14 వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
14 A sua confiança será arrancada da sua tenda, onde está confiado, e isto o fará caminhar para o rei dos terrores.
15 వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసము చేయుదురువారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.
15 Morará na sua mesma tenda, o que não lhe pertence; espalhar-se-á enxofre sobre a sua habitação.
16 క్రింద వారి వేళ్లు ఎండిపోవునుపైన వారి కొమ్మలు నరకబడును.
16 Por baixo se secarão as suas raízes e por cima serão cortados os seus ramos.
17 భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరుమైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.
17 A sua memória perecerá da terra, e pelas praças não terá nome.
18 జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురుభూలోకములోనుండి వారిని తరుముదురు.
18 Da luz o lançarão nas trevas, e afugentá-lo-ão do mundo.
19 వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైననుఉండరువారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడుఒకడైనను ఉండడు.
19 Não terá filho nem neto entre o seu povo, e nem quem lhe suceda nas suas moradas.
20 తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షనుచూచివిస్మయమొందుదురుపూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు.
20 Do seu dia se espantarão os do ocidente, assim como se espantam os do oriente.
21 నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టునుదేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది.
21 Tais são, na verdade, as moradas do perverso, e este é o lugar do que não conhece a Deus.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 18, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.