Ezequiel 48

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము .. అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరే నాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.
1 Ora, estes são os nomes das tribos. Desde o extremo norte até a costa, desde o caminho de Hetlom, indo para Hamate, Hazar-Enom, a fronteira de Damasco ao norte, até a costa de Hamate; porque esses são os seus lados ao leste e oeste; a porção de Dã.
2 దానుయొక్క సరిహద్దునానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.
2 E junto a fronteira de Dã, desde o lado oriental até o lado ocidental, uma porção para Aser.
3 ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.
3 E junto a fronteira de Aser, desde o lado oriental até o ocidental, uma porção para Naftali.
4 నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమ రలుగా మనష్షేయులకు ఒకభాగము.
4 E junto a fronteira de Naftali, desde o lado oriental até o lado ocidental, uma porção para Manassés.
5 మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయి మీయులకు ఒక భాగము.
5 E junto a fronteira de Manassés, desde o lado oriental até o lado ocidental, uma porção para Efraim.
6 ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము.
6 E junto a fronteira de Efraim, desde o lado oriental até o lado ocidental, uma porção para Rúben.
7 రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒకభాగము.
7 E junto a fronteira de Rúben, desde o lado oriental até o lado ocidental, uma porção para Judá.
8 యూదావారి సరిహద్దును అనుకొని తూర్పు పడమర లుగా మీరు ప్రతిష్టించు ప్రతిష్టిత భూమియుండును. దాని వెడల్పు ఇరువదియైదు వేల కొలకఱ్ఱలు; దాని నిడివి తూర్పునుండి పడమరవరకు తక్కినభాగముల నిడివి వలెనే యుండును; పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండవలెను.
8 E junto a fronteira de Judá, desde o lado oriental até o lado ocidental, será a oferta que oferecereis de vinte e cinco mil canas de largura, e de comprimento de cada uma das outras partes, desde o lado oriental até o lado ocidental; e o santuário estará no meio dela.
9 యెహోవాకు మీరు ప్రతిష్టించు ప్రదేశము ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడుల్పునై యుండవలెను.
9 A oblação que haveis de oferecer ao SENHOR será do comprimento de vinte e cinco mil, e de dez mil em largura.
10 ఈ ప్రతిష్ఠితభూమి యాజకులదగును. అది ఉత్తరదిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పడమటి దిక్కున పదివేల కొల కఱ్ఱల వెడల్పును తూర్పుదిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును దక్షిణ దిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండును.
10 E para eles, para os sacerdotes, será esta uma oblação santa, em direção ao norte vinte e cinco mil de comprimento, e para o ocidente dez mil de largura, e para o oriente dez mil de largura, e em direção ao sul vinte e cinco mil de comprimento; e o santuário do SENHOR estará no meio dela.
11 ఇది సాదోకు సంతతివారై నాకు ప్రతిష్టింపబడి నేను వారి కప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును; ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లె వారు నన్ను విడిచిపోలేదు.
11 E será para os sacerdotes que são santificados dentre os filhos de Zadoque, que guardaram a minha ordenança, que não se desviaram, quando os filhos de Israel se desviaram, como os levitas se desviaram.
12 ప్రతిష్ఠిత భూమియందు లేవీయుల సరిహద్దుదగ్గర వారికొక చోటు ఏర్పాటగును; అది అతి పరిశుద్ధముగా ఎంచబడును.
12 E esta oblação da terra que é ofertada será para eles uma coisa santíssima, junto a fronteira dos levitas.
13 యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయుల కొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువది యయిదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునైయుండును. దాని నిడివియంతయు ఇరువది యయిదు వేల కొలకఱ్ఱలును వెడల్పంతయు పది వేల కొలకఱ్ఱలును ఉండును.
13 E contra a fronteira dos sacerdotes, os levitas terão vinte e cinco mil de comprimento, e dez mil de largura; todo o comprimento será de vinte e cinco mil, e a largura dez mil.
14 అది యెహోవాకు ప్రతి ష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్య కూడదు.
14 E eles não venderão, nem trocarão, nem alienarão as primícias da terra, porque é santo ao SENHOR.
15 ​ఇరువది యయిదువేల కొలకఱ్ఱల భూమిని ఆను కొని వెడల్పున మిగిలిన అయిదువేల కొలకఱ్ఱలుగల చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదై, పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకువచ్చును; దాని మధ్య పట్టణము కట్టబడును.
15 E as cinco mil, as que restaram da largura, diante das vinte e cinco mil, serão um lugar profano na cidade, para habitação, e para os arredores; e a cidade estará no meio deles.
16 దాని పరిమాణ వివరమేదనగా, ఉత్తరదిక్కువ నాలుగువేలఐదువందల కొలకఱ్ఱలు, దక్షిణ దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, తూర్పు దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, పడమటి దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు.
16 E estas serão as suas medidas: o lado do norte de quatro mil e quinhentas, o lado do sul de quatro mil e quinhentas, o lado oriental de quatro mil e quinhentas e o lado ocidental de quatro mil e quinhentas.
17 పట్టణము నకు చేరిన ఖాళీస్థలము ఉత్తరపుతట్టున రెండువందల యేబది కొలకఱ్ఱలు, దక్షిణపుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, తూర్పుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, పడమటి తట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు ఉండవలెను.
17 E os arredores da cidade serão, em direção ao norte de duzentas e cinquenta, em direção ao sul de duzentas e cinquenta, para o oriente de duzentas e cinquenta, e para o ocidente de duzentas e cinquenta.
18 ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠితభూమిని యానుకొని తూర్పు తట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొల కఱ్ఱలును ఉండును.
18 E o resíduo do comprimento, contra a oblação da porção santa, será dez mil para o oriente, e dez mil para o ocidente; e será contra à oblação da porção santa; e o seu aumento será para alimentar àqueles que servem a cidade.
19 ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.
19 E aqueles que servem à cidade, servi-la-ão dentre todas as tribos de Israel.
20 ప్రతిష్ఠిత భూమియంతయు ఇరువది యయిదు వేల కొల కఱ్ఱల చచ్చౌకముగా ఉండును; దానిలో నాలుగవ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను.
20 Toda a oblação será de vinte e cinco mil por vinte e cinco mil. Oferecereis a oblação santa em quadrado, com a possessão da cidade.
21 ప్రతిష్ఠితస్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయ బడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని, అనగా తూర్పుదిశను ప్రతిష్ఠితస్థానముగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును పడ మటి దిశను గోత్రస్థాన ములుగా ఏర్పడిన యిరువది యయిదు వేల కొలకఱ్ఱలును గల భూమిని యానుకొనుస్థానము అధిపతిదగును. ప్రతి ష్ఠిత స్థానమును, మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును.
21 E o resíduo será para o príncipe; de um lado e do outro lado da oblação santa, e da possessão da cidade, contra as vinte e cinco mil da oblação, em direção a fronteira oriental, e ocidental, contra as vinte e cinco mil, até a fronteira do ocidente, de acordo com as porções para o príncipe; e eis que será oblação santa, e o santuário da casa estará no meio dela.
22 యూదావారి సరిహద్దు నకును బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థాన మును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును.
22 E além da possessão dos levitas, e desde a possessão da cidade, e estando no meio de tudo do que é do príncipe, entre a fronteira de Judá, e a fronteira de Benjamim, isso será para o príncipe.
23 తూర్పునుండి పడమటివరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పా టగును. బెన్యామీనీయులకు ఒక భాగము,
23 E quanto ao restante das tribos, desde o lado oriental até o lado ocidental, Benjamim terá uma porção.
24 బెన్యామీ నీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒకభాగము;
24 E junto a fronteira de Benjamim, desde o lado oriental até o lado ocidental, Simeão terá uma porção.
25 ​షిమ్యోనీయుల సరి హద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయు లకు ఒకభాగము
25 E junto a fronteira de Simeão, desde o lado oriental até o lado ocidental, Issacar uma porção.
26 ​ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పుపడమరలుగా జెబూలూనీయులకు ఒకభాగము,
26 E junto a fronteira de Issacar, desde o lado oriental até o lado ocidental, Zebulom uma porção.
27 జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడ మరలుగా గాదీయులకు ఒకభాగము;
27 E junto a fronteira de Zebulom, desde o lado oriental até o lado ocidental, Gade uma porção.
28 దక్షిణదిక్కున తామారునుండి కాదేషులోనున్న మెరీబా ఊటలవరకు నదివెంబడి మహాసముద్రమువరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును.
28 E junto a fronteira de Gade, no lado sul, em direção ao sul, a fronteira será desde Tamar até as águas da contenda em Cades, em direção ao rio até o mar grande.
29 మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రము లకు విభాగింపవలసిన దేశము ఇదే. వారివారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ.
29 Esta é a terra que dividireis em lotes como herança às tribos de Israel; e estas são as suas porções, diz o Senhor DEUS.
30 పట్టణస్థాన వైశాల్యత ఎంతనగా, ఉత్తరమున నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.
30 E estas são as saídas da cidade pelo lado norte: quatro mil e quinhentas medidas.
31 ఇశ్రాయేలీ యుల గోత్రపు పేళ్లనుబట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవిదనియు మూడు గుమ్మములుండవలెను.
31 E os portões da cidade terão os nomes das tribos de Israel; três portões para o norte: o portão de Rúben, o portão de Judá, o portão de Levi.
32 తూర్పుతట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరి మాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు బెన్యామీను దనియు దానుదనియు మూడు గుమ్మములుండవలెను.
32 E do lado oriental quatro mil e quinhentas, e três portões, que são o portão de José, o portão de Benjamim, o portão de Dã.
33 దక్షిణపుతట్టు నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరి మాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు ఇశ్శాఖారు దనియు జెబూలూనుదనియు మూడు గుమ్మములుండవలెను.
33 E do lado sul quatro mil e quinhentas medidas, e três portões: o portão de Simeão, o portão de Issacar, o portão de Zebulom.
34 పడమటితట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణ ముగలది. ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలి దనియు మూడు గుమ్మములుండవలెను.
34 Do lado ocidental quatro mil e quinhentas, com os seus três portões: o portão de Gade, o portão de Aser, o portão de Naftali.
35 దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.
35 Em torno de dezoito mil medidas; e o nome da cidade desde aquele dia será: O SENHOR está ali.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Ezequiel 48, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.