Ester 8
Telugu Bible (GL_TELUGU) vs BKJ
1 ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణియైన ఎస్తేరున కిచ్చెను ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియ జేసినమీదట అతడు రాజు సన్నిధికి రాగా
1 Naquele dia, deu rei Assuero à rainha Ester a casa de Hamã, o inimigo dos judeus. E Mardoqueu veio diante do rei; porque Ester havia declarado quem ele era.
2 రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిమీద అధికారిగా ఉంచెను.
2 E o rei retirou o seu anel, o qual ele tinha tirado de Hamã, e deu-o a Mardoqueu. E Ester pôs Mardoqueu sobre a casa de Hamã.
3 మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా
3 E Ester falou mais uma vez diante do rei, e caiu aos seus pés, e com lágrimas suplicou para afastar a maldade de Hamã, o agagita, e o plano que ele tinha preparado contra os judeus.
4 రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి
4 Então, o rei estendeu o cetro de ouro em direção a Ester. Assim, Ester levantou-se e se pôs de pé diante do rei,
5 రాజవైన తమకు సమ్మతియైనయెడలను,తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచిన యెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాన నైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.
5 e disse: Se aprouver ao rei, e se tenho achado favor à sua vista, e se este negócio é reto diante do rei, e se eu lhe agrado aos seus olhos, escreva-se que se revoguem as cartas elaboradas por Hamã, o filho de Hamedata, o agagita, as quais ele escreveu para destruir os judeus que estão em todas as províncias do rei;
6 నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింప గలనని మనవిచేయగా
6 pois como resistirei ver o mal que virá ao meu povo? Ou, como resistirei ver a destruição da minha parentela?
7 రాజైన అహ ష్వేరోషు రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెల విచ్చెనుహామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను; అతడు యూదులను హతముచేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను.
7 Então, o rei Assuero disse à rainha Ester e ao judeu Mardoqueu: Eis que dei a Ester a casa de Hamã, e a ele o enforcaram sobre a forca, porque ele lançou a sua mão contra os judeus.
8 అయితే రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు; కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి.
8 Escrevei vós também para os judeus, como preferirdes, em nome do rei, e selai-o com o anel do rei; porque o escrito que é feito em nome do rei, e selado com o anel do rei, homem nenhum pode reverter.
9 సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దిన మందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.
9 Então, foram chamados os escribas do rei naquela hora, no terceiro mês, que é o mês de sivã, no seu vigésimo terceiro dia; e foi escrito de acordo com tudo o que Mardoqueu ordenou aos judeus, e aos tenentes, e aos vice-reis e governantes das províncias que são desde a Índia até a Etiópia, cento e vinte e sete províncias, para cada província de acordo com a sua escrita, e para cada povo segundo a sua língua, e para os judeus de acordo com a sua escrita, e de acordo com a sua língua.
10 రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరుపనికి పెంచ బడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను.
10 E ele escreveu em nome do rei Assuero, e selou isto com o anel do rei, e enviou cartas por mensageiros em lombo de cavalo, e montadores de mulas, camelos, e dromedários novos;
11 రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆ యా ప్రదేశములలో నుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశు వులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూల పరచి
11 nas quais o rei concedeu aos judeus que estavam em cada cidade que se reunissem, e se levantassem pela sua vida, para destruir, matar, e fazer perecer, todo o poder do povo e da província que quisesse lhes atacar, tanto pequenos, como mulheres, e que se saqueassem os seus despojos, por uma presa,
12 వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.
12 em um dia, em todas as províncias do rei Assuero, a saber, no décimo terceiro dia do décimo segundo mês, que é o mês de adar.
13 మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆ యా సంస్థానముల లోని జనులకందరికి పంపించవలెననియు,యూదులు తమ శత్రువులమీద పగతీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను.
13 A cópia do escrito para um mandamento a ser dado em cada província foi publicada a todo o povo, e para que os judeus estivessem preparados para aquele dia, para se vingarem dos seus inimigos.
14 రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింప బడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.
14 Assim, saíram os mensageiros que montavam em mulas e camelos, apressados e pressionados avante pelo mandamento do rei. E o decreto foi dado no palácio de Susã.
15 అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోష మొందెను.
15 E Mardoqueu saiu da presença do rei em vestes reais de azul e branco, e com uma grande coroa de ouro, e com uma vestimenta de linho fino e púrpura; e a cidade de Susã regozijou-se e alegrou-se.
16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.
16 Os judeus tinham luz, e alegria, e regozijo e honra.
17 రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోష మును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.
17 E, em toda província, e em toda cidade, aonde chegou o mandamento do rei e o seu decreto, os judeus tiveram alegria e contentamento, um banquete e um bom dia. E muitos do povo da terra se tornaram judeus; porque o medo dos judeus lhes sobreveio.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Ester 8, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.