Eclesiastes 7

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.
1 Um bom nome é melhor do que unguento precioso, e o dia da morte do que o dia do nascimento de alguém.
2 విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.
2 Melhor é ir à casa onde há luto do que ir à casa onde há banquete, porque naquela está o fim de todos os homens, e os vivos o levam ao seu coração.
3 నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును.
3 A tristeza é melhor do que o riso, porque com a tristeza do semblante se melhora o coração.
4 జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధి హీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును.
4 O coração do sábio está na casa do luto, mas o coração dos tolos está na casa da alegria.
5 బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు.
5 Melhor é para o homem ouvir a repreensão do sábio, do que ouvir a canção dos tolos.
6 ​ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము.
6 Porque tal como o crepitar dos espinhos debaixo de um pote, tal é o riso do tolo; isto também é vaidade.
7 ​అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు; లంచము పుచ్చుకొనుటచేత మనస్సు చెడును.
7 Verdadeiramente a opressão torna um homem sábio louco, e um presente destrói o coração.
8 కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు
8 Melhor é o fim das coisas do que o princípio delas; e o paciente de espírito é melhor do que o orgulhoso de espírito.
9 ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.
9 Não te apresses no teu espírito a irar-te, porque a ira repousa no seio dos tolos.
10 ఈ దినములకంటె మునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు
10 Nunca digas: Por que foram os dias passados melhores do que estes? Porque não há sabedoria nesta pergunta.
11 ​జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము.
11 A sabedoria é tão boa quanto a herança, e através dela lucram os que veem o sol.
12 జ్ఞానము ఆశ్ర యాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.
12 Porque a sabedoria é uma defesa, e o dinheiro também é uma defesa; mas a excelência do conhecimento é que a sabedoria dá vida aos que a têm.
13 దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును?
13 Considera a obra de Deus; pois, quem poderá endireitar o que ele fez torto?
14 ​సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు.
14 No dia da prosperidade alegra-te, mas no dia da adversidade considera; porque também Deus fez um em oposição ao outro, para que o homem nada descubra do que há de vir depois dele.
15 నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు.
15 Todas as coisas vi nos dias da minha vaidade: há um homem justo que perece na sua justiça, e há um homem ímpio que prolonga a sua vida na sua maldade.
16 అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధిక ముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసి కొందువు?
16 Não sejas demasiadamente justo, nem faça a si mesmo muito sábio; por que te destruirias a ti mesmo?
17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు?
17 Não sejas demasiadamente ímpio, nem sejas louco; por que morrerias antes do teu tempo?
18 నీవు దీని పట్టుకొనియుండుటయు దానిని చేయివిడువకుండుటయు మేలు; దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటిని కొనసాగించును.
18 Bom é que guardes isto, sim, também disto não retires a tua mão; porque quem teme a Deus escapa de tudo isso.
19 పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము.
19 A sabedoria fortalece ao sábio, mais do que dez homens poderosos que haja na cidade.
20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.
20 Porque não há homem justo sobre a terra, que faça o bem, e não peque.
21 ​నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము.
21 Não atentes a todas as palavras que são ditas, para que não ouças o teu servo amaldiçoar-te.
22 ​నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా.
22 Por muitas vezes também o teu coração reconhece que tu, da mesma maneira, amaldiçoaste a outros.
23 ​ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను.
23 Tudo isto provei pela sabedoria; eu disse: Eu serei sábio; mas isto ainda estava longe de mim.
24 సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు
24 Aquilo que está distante, e excede em profundidade; quem pode encontrá-lo?
25 వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుట కును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని.
25 Eu apliquei o meu coração para saber, inquirir e buscar a sabedoria e a razão das coisas, e para conhecer a impiedade da insensatez, e até mesmo da tolice e da loucura.
26 మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.
26 E, eu acho mais amarga do que a morte a mulher em cujo coração são laços e redes, e cujas mãos são ataduras; aquele que agradar a Deus escapará dela, mas o pecador será preso por ela.
27 సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది.
27 Eis aqui o que encontrei, diz o Pregador, conferindo uma coisa com a outra para achar a razão delas;
28 అదేదనగా వెయ్యిమంది పురుషు లలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు.
28 a qual ainda busca a minha alma, porém eu não a achei; um homem entre mil eu encontrei, mas uma mulher entre todas estas não encontrei.
29 ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
29 Eis aqui, o que tão somente achei: que Deus fez o homem reto, porém eles buscaram muitas invenções.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Eclesiastes 7, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.