2 Samuel 2

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 ఇది జరిగిన తరువాతయూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగాపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను.నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగాహెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.
1 E sucedeu, depois disso, que Davi consultou o SENHOR, dizendo: Devo eu subir para alguma das cidades de Judá? E o SENHOR lhe disse: Sobe. E Davi disse: Para onde devo subir? E ele disse: Para Hebrom.
2 కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను.
2 Assim, Davi subiu para lá, junto com as suas duas esposas, Ainoã, a jezreelita, e Abigail, a carmelita, esposa de Nabal.
3 మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి.
3 E os seus homens que estavam com ele Davi fez subir, cada qual com a sua casa; e eles habitaram nas cidades de Hebrom.
4 అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.
4 E os homens de Judá vieram, e ali ungiram Davi rei sobre a casa de Judá. E eles contaram a Davi, dizendo: Os homens de Jabes-Gileade foram aqueles que sepultaram Saul.
5 సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపిమీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక.
5 E Davi enviou mensageiros até os homens de Jabes-Gileade, e disse-lhes: Benditos sejais vós do SENHOR, porque mostrastes esta bondade para com o vosso senhor, e até mesmo a Saul, tendo-o sepultado.
6 యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను.
6 E, agora, mostre o SENHOR bondade e verdade para convosco; e eu também retribuirei a vós esta bondade, porque vós fizestes isto.
7 మీ యజమానుడగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను.
7 Portanto, agora, que sejam fortalecidas as vossas mãos e que vós sejais valentes; porque o vosso mestre Saul está morto, e também a casa de Judá me ungiu rei sobre eles.
8 నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి,
8 Todavia, Abner, o filho de Ner, capitão do exército de Saul, tomou Isbosete, o filho de Saul, e o trouxe até Maanaim;
9 గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయిమీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను.
9 e fê-lo rei sobre Gileade, e sobre os assuritas, e sobre Jezreel, e sobre Efraim, e sobre Benjamim, e sobre todo o Israel.
10 సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేల నారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి.
10 Isbosete, o filho de Saul, tinha quarenta anos de idade quando começou a reinar sobre Israel, e reinou por dois anos. A casa de Judá, no entanto, seguiu Davi.
11 దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు.
11 E o tempo que Davi foi rei em Hebrom, sobre a casa de Judá, foi sete anos e seis meses.
12 అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారు డగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా
12 E saiu Abner, o filho de Ner, e os servos de Isbosete, o filho de Saul, de Maanaim para Gibeão.
13 సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులును బయలుదేరి వారి నెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా
13 E Joabe, o filho de Zeruia, e os servos de Davi, saíram e se reuniram junto ao tanque de Gibeão; e eles se assentaram, um de um lado do tanque, e o outro do outro lado do tanque.
14 అబ్నేరు లేచిమన యెదుట ¸°వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను.
14 E Abner disse a Joabe: Que se levantem os moços agora e joguem diante de nós. E Joabe disse: Que se levantem.
15 లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి.
15 Então, ali se levantaram e atravessaram em número de doze de Benjamim, os quais pertenciam a Isbosete, o filho de Saul, e doze dos servos de Davi.
16 ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని1 ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.
16 E eles apanharam, cada um, o seu companheiro pela cabeça, e lançaram a sua espada na lateral do seu companheiro; de forma que eles caíram juntos; pelo que aquele lugar foi chamado de Helcate-Hazurim, o qual está em Gibeão.
17 తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.
17 E houve uma batalha muito intensa naquele dia; e Abner foi ferido, e também os homens de Israel, diante dos servos de Davi.
18 సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక
18 E havia três filhos de Zeruia lá: Joabe, Abisai e Asael; e Asael era tão leve de pés quanto um cabrito selvagem.
19 ​అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా
19 E Asael perseguiu Abner; e ao ir ele não se desviava nem para a direita, nem para a esquerda de seguir Abner.
20 ​అబ్నేరు వెనుకకు తిరిగినీవు అశా హేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశా హేలునే యనెను.
20 Então, Abner olhou para trás de si, e disse: És tu Asael? E ele respondeu: Sou eu.
21 ​నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ¸°వనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా
21 E Abner lhe disse: Desvia-te para a tua direita ou para a tua esquerda, e agarra-te a um dos moços, e toma a sua armadura. Contudo, Asael não desejava se desviar de segui-lo.
22 అబ్నేరునన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగల ననెను.
22 E Abner disse novamente a Asael: Desvia-te de seguir-me: Por que eu deveria te ferir ao chão? Como, então, levantaria a minha face diante de Joabe, teu irmão?
23 అతడునేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరి గాని
23 Todavia ele se recusou a desviar-se; pelo que Abner, com a extremidade posterior da lança, o feriu debaixo da quinta costela, de modo que a lança saiu por trás dele; e ele caiu ali, e morreu no mesmo lugar; e sucedeu que tantos quantos chegavam ao local onde Asael caiu e morreu ficavam imóveis.
24 యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్త మించెను.
24 Também Joabe e Abisai perseguiram Abner; e o sol se pôs quando eles já tinham chegado ao outeiro de Amá, que está diante de Giá, junto ao caminho do deserto de Gibeão.
25 ​బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని, ఒక కొండమీద నిలువగా
25 E os filhos de Benjamim se reuniram após Abner, e se tornaram uma tropa, e se puseram no cume de um outeiro.
26 ​అబ్నేరు కేకవేసికత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను.
26 A seguir, Abner chamou Joabe, e disse: Devorará a espada para sempre? Não sabes tu que haverá amargura no fim derradeiro? Quanto tempo haverá, então, antes de ordenares ao povo que retorne da perseguição aos seus irmãos?
27 ​అందుకు యోవాబుదేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయియుందురని చెప్పి
27 E Joabe disse: Como vive Deus, a menos que tu tivesses falado, então, certamente pela manhã, cada um do povo teria desistido de perseguir o seu irmão.
28 బాకా ఊదగా జనులందరు నిలిచి, ఇశ్రాయేలువారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి.
28 Assim, Joabe soprou uma trombeta e todo o povo ficou imóvel, e não mais perseguiu Israel, tampouco continuaram a lutar com eles.
29 అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంత మైదానము గుండ ప్రయాణము చేసి యొర్దానునది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి.
29 E Abner e os seus homens caminharam aquela noite toda pela planície, e atravessaram o Jordão, e seguiram por todo o Bitrom, e chegaram a Maanaim.
30 ​యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక పందొమ్మండుగురు లేకపోయిరి.
30 E Joabe retornou da perseguição a Abner; e quando ele havia reunido todo o povo, dos servos de Davi faltavam dezenove homens e Asael.
31 ​అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను మూడువందల అరువది మందిని హతము చేసిరి.
31 Os servos de Davi, porém, haviam ferido homens de Benjamim e de Abner, de forma que morreram trezentos e sessenta homens.
32 ​జనులు అశాహేలును ఎత్తికొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.
32 E levantaram Asael, e o sepultaram no sepulcro do seu pai, o qual ficava em Belém. E Joabe e os seus homens seguiram a noite toda, e chegaram a Hebrom no romper do dia.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 2 Samuel 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.