2 Samuel 22

Telugu Bible (GL_TELUGU) vs NAA

Sair da comparação
NAA Nova Almeida Atualizada 2017
1 యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తనశత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పియెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను.
1 Davi falou ao Senhor as palavras deste cântico, no dia em que o Senhor o livrou das mãos de todos os seus inimigos e das mãos de Saul.
2 యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.
2 Ele disse: O a minha fortaleza, o meu libertador;
3 నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును.నా కేడెము నా రక్షణశృంగమునా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడుబలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.
3 o meu Deus, o meu rochedo em que me refugio; o meu escudo, a força da minha salvação, o meu alto refúgio. Ó Deus, tu me salvas da violência.
4 కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱ పెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.
4 Invoco o Senhor , digno de ser louvado, e serei salvo dos meus inimigos.
5 మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగనువరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను
5 Porque ondas de morte me cercaram, torrentes de perdição me impuseram terror.
6 పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను
6 Cadeias infernais me envolveram, e tramas de morte me surpreenderam.
7 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెనునా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.
7 Na minha angústia, invoquei o gritei por socorro ao meu Deus. Do seu templo ele ouviu a minha voz, e o meu clamor chegou aos seus ouvidos.
8 అప్పుడు భూమి కంపించి అదిరెనుపరమండలపు పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను.
8 Então a terra se abalou e tremeu; vacilaram também os fundamentos dos céus e se abalaram, porque ele estava irado.
9 ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెనుఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెనునిప్పు కణములను రాజబెట్టెను.
9 Das suas narinas subiu fumaça, e fogo devorador saiu da sua boca; dele saíram brasas ardentes.
10 మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
10 Ele baixou os céus e desceu, e teve sob os pés densa escuridão.
11 కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను.గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
11 Cavalgava um querubim e voou; foi levado sobre as asas do vento.
12 గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను.నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
12 Por abrigo pôs ao redor de si trevas, ajuntamento de águas, nuvens dos céus.
13 ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.
13 Do resplendor que diante dele havia, brasas de fogo se acenderam.
14 యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను.
14 O Senhor trovejou desde os céus; o Altíssimo levantou a sua voz.
15 తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెనుయెహోవా గద్దింపునకుతన నాసికారంధ్రముల శ్వాసము వడిగావిడువగా ఆయన గద్దింపునకుప్రవాహముల అడుగుభాగములు కనబడెను
15 Atirou as suas flechas e espalhou os meus inimigos; multiplicou os seus raios e os dispersou.
16 భూమి పునాదులు బయలుపడెను.
16 Então se viu o leito do mar, e se descobriram os fundamentos do mundo, pela repreensão do pelo sopro irado das suas narinas.
17 ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెనునన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.
17 Do alto o Senhor me estendeu a mão e me segurou; ele me tirou das águas profundas.
18 బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు, నాకంటె బలిష్ఠులై యుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.
18 Livrou-me de forte inimigo e dos que me odiavam, pois eram mais poderosos do que eu.
19 ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను.
19 Eles me atacaram no dia da minha calamidade, mas o de amparo.
20 నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పిం చెను.
20 Trouxe-me para um lugar espaçoso; livrou-me, porque ele se agradou de mim.
21 నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టియే నాకు ప్రతిఫల మిచ్చెను.
21 O Senhor me retribuiu segundo a minha justiça; recompensou-me conforme a pureza das minhas mãos.
22 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను.
22 Pois tenho guardado os caminhos do e não me afastei perversamente do meu Deus.
23 ఆయన న్యాయవిధుల నన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను.
23 Porque todos os seus juízos estão diante de mim, e não rejeitei os seus preceitos.
24 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.
24 Também fui íntegro para com ele e me guardei da iniquidade.
25 కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
25 Por isso, o Senhor me retribuiu segundo a minha justiça, conforme a minha pureza, na sua presença.
26 దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగానుందువు.
26 Para com quem é fiel, fiel te mostras; com o íntegro, também íntegro.
27 సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.
27 Com o puro, puro te mostras; com o perverso, inflexível.
28 శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు
28 Tu salvas o povo humilde, mas, com um lance de vista, abates os orgulhosos.
29 యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.
29 Tu, Senhor , és a minha lâmpada; o nas minhas trevas.
30 నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములనుదాటుదును.
30 Pois contigo posso atacar exércitos, com o meu Deus salto muralhas.
31 దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.
31 O caminho de Deus é perfeito; a palavra do ele é escudo para todos os que nele se refugiam.
32 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
32 Pois quem é Deus além do E quem é rochedo, a não ser o nosso Deus?
33 దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడి పించును.
33 Deus é a minha fortaleza e a minha força e ele aperfeiçoa o meu caminho.
34 ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.
34 Ele deu aos meus pés a ligeireza das corças e me firmou nas minhas alturas.
35 నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు బెట్టును.
35 Ele treinou as minhas mãos para o combate, tanto que os meus braços vergaram um arco de bronze.
36 నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.
36 Também me deste o escudo da tua salvação, e a tua clemência me engrandeceu.
37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.
37 Alargaste o caminho sob meus passos, e os meus pés não vacilaram.
38 నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.
38 Persegui os meus inimigos e os derrotei, e só voltei depois de ter acabado com eles.
39 నేను వారిని మింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు.
39 Acabei com eles, esmagando-os a tal ponto, que não puderam se levantar; caíram sob os meus pés.
40 యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నామీదికి లేచినవారిని నీవు అణచివేయుదువు.
40 Pois me cingiste de força para o combate e me submeteste os que se levantaram contra mim.
41 నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును.
41 Também puseste em fuga os meus inimigos, e os que me odiavam, eu os exterminei.
42 వారు ఎదురు చూతురు గాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు యెహోవాకొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును.
42 Olharam, mas não houve quem os salvasse; olharam para o mas ele não respondeu.
43 నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను.
43 Então os moí como o pó da terra; esmaguei-os e, como a lama das ruas, os amassei.
44 నా ప్రజల కలహములలో పడకుండ నీవు నన్నువిడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు.
44 Dos conflitos do meu povo me livraste e me fizeste cabeça das nações; um povo que eu não conhecia me serviu.
45 అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధేయులగుదురు
45 Os estrangeiros se mostram submissos a mim; bastou-lhes ouvir a minha voz, logo me obedeceram.
46 అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.
46 Os estrangeiros fraquejaram e, tremendo, saíram das suas fortalezas.
47 యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక
47 O Senhor vive! Bendita seja a minha rocha! Exaltado seja o meu Deus, a rocha da minha salvação!
48 ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
48 O Deus que por mim tomou vingança e me submeteu povos;
49 ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
49 o Deus que me tirou do meio dos meus inimigos; sim, tu que me exaltaste acima dos meus adversários e me livraste dos homens violentos.
50 అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను.
50 Por isso, eu te glorificarei entre os gentios, ó e cantarei louvores ao teu nome.
51 నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమున కును నిత్యము కనికరము చూపువాడవు.
51 É ele quem dá grandes vitórias ao seu rei e usa de misericórdia para com o seu ungido, com Davi e sua posteridade, para sempre.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 2 Samuel 22, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.