2 Reis 23

Telugu Bible (GL_TELUGU) vs BKJ

Sair da comparação
1 అప్పుడు రాజు యూదా పెద్దలనందరిని...యెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి
1 E o rei enviou, e se reuniram a ele todos os anciãos de Judá e de Jerusalém.
2 ​యూదావారినందరిని యెరూషలేము కాపురస్థులనందరిని, యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరిని పిలుచుకొని, యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవామందిరమందు దొరకిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను.
2 E o rei subiu à casa do SENHOR, e todos os homens de Judá, e com ele todos os habitantes de Jerusalém, e os sacerdotes, e os profetas, e todo o povo, tanto os pequenos como os grandes; e ele leu aos seus ouvidos todas as palavras do livro do pacto que fora achado na casa do SENHOR.
3 ​రాజు ఒక స్తంభముదగ్గర నిలిచియెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మ తోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.
3 E o rei se pôs de pé junto a um pilar, e fez um pacto diante do SENHOR, para andarem segundo o SENHOR, e para guardarem os seus mandamentos e os seus testemunhos e os seus estatutos de todo seu coração e de toda a sua alma, para cumprirem as palavras deste pacto que estavam escritas neste livro. E todo o povo apoiou este pacto.
4 ​రాజుబయలు దేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణము లన్నిటి యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను.
4 E o rei ordenou a Hilquias, o sumo sacerdote, e aos sacerdotes da segunda ordem, e aos guardadores da porta, para retirarem do templo do SENHOR todos os vasos que foram feitos para Baal, e para o bosque, e para todo o exército do céu; e ele os queimou na parte externa de Jerusalém, nos campos de Cedrom, e carregou as suas cinzas até Betel.
5 మరియు యూదా పట్టణములయం దున్న ఉన్నతస్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రు లకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపి వేసెను.
5 E ele pôs abaixo os sacerdotes idólatras, aos quais os reis de Judá haviam ordenado para queimar incenso nos lugares altos, nas cidades de Judá, e nos lugares ao redor de Jerusalém; também aqueles que queimavam incenso a Baal, ao sol, e à lua, e aos planetas, e a todo o exército do céu.
6 ​యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.
6 E ele retirou a árvore sagrada da casa do SENHOR, para fora de Jerusalém, até o ribeiro de Cedrom, e a queimou junto ao ribeiro de Cedrom, e a triturou até virar pó, e lançou o seu pó sobre os túmulos dos filhos do povo.
7 ​మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.
7 E ele demoliu as casas dos sodomitas, que ficavam junto à casa do SENHOR, onde as mulheres teciam pingentes para a árvore sagrada.
8 ​యూదా పట్టణము లోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను.
8 E ele retirou todos os sacerdotes das cidades de Judá, e profanou os lugares altos, onde os sacerdotes haviam queimado incenso, desde Geba até Berseba, e demoliu os lugares altos dos portões que estavam à entrada do portão de Josué, o governador da cidade, os quais estavam à esquerda, junto ao portão da cidade.
9 ​అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూ షలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు.
9 Todavia os sacerdotes dos lugares altos não subiram ao altar do SENHOR em Jerusalém, mas comeram do pão ázimo no meio dos seus irmãos.
10 ​మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్‌ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను.
10 E ele profanou Tofete, que está no vale dos filhos de Hinom, para que nenhum homem pudesse fazer o seu filho ou a sua filha passar pelo meio do fogo para Moloque.
11 ​ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంట పములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చి వేసెను.
11 E ele removeu os cavalos que os reis de Judá tinham dado ao sol, à entrada da casa do SENHOR, pela câmara de Natã-Meleque, o camareiro, a qual estava nos arredores, e queimou as carruagens do sol com fogo.
12 ​మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడ గొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.
12 E os altares que estavam no topo da câmara superior de Acaz, os quais os reis de Judá tinham feito, e os altares que Manassés fizera nos dois pátios da casa do SENHOR, o rei pôs abaixo, e os demoliu dali, e lançou o seu pó no ribeiro de Cedrom.
13 ​​యెరూషలేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తా రోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలురాజైన సొలొ మోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి
13 E os lugares altos que estavam diante de Jerusalém, os quais estavam à direita do monte da corrupção, o qual Salomão, o rei de Israel, havia edificado para Astarote, a abominação dos sidônios, e para Quemós, a abominação dos moabitas, para Milcom, a abominação dos filhos de Amom, o rei profanou.
14 ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను.
14 E ele quebrou em pedaços as imagens, e cortou os bosques, e encheu os seus lugares com os ossos de homens.
15 ​బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను.
15 Além disso, o altar que estava em Betel, e o lugar alto que Jeroboão, o filho de Nebate, que fez Israel pecar, até aquele altar e o lugar alto ele os demoliu, e queimou o lugar alto, e o triturou até virar pó, e queimou o bosque.
16 ​యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను.
16 E, ao se virar, Josias espionou os sepulcros que estavam ali no monte, e mandou tirar os ossos dos sepulcros, e os queimou sobre o altar, e o contaminou, segundo a palavra do SENHOR que o homem de Deus proclamou, aquele que predisse estas palavras.
17 అంతట అతడునాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదాదేశమునుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి.
17 Então, ele disse: Que monumento é aquele que vejo? E os homens da cidade lhe disseram: É o sepulcro do homem de Deus, que veio de Judá, e proclamou estas coisas que tu tens feito contra o altar de Betel.
18 అందు కతడుదానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి.
18 E ele disse: Deixai-o em paz; que nenhum homem mova os seus ossos. Assim, eles deixaram os seus ossos em paz, com os ossos do profeta que saiu de Samaria.
19 ​మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిర ములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను.
19 E também todas as casas dos lugares altos que estavam nas cidades de Samaria, as quais os reis de Israel haviam feito para provocar o SENHOR à ira, Josias removeu, e fez a eles segundo todos os atos que ele havia feito em Betel.
20 అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజ కులనందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నరశల్య ములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
20 E matou todos os sacerdotes dos lugares altos que estavam ali sobre os altares, e queimou ossos de homens sobre eles, e retornou a Jerusalém.
21 అంతట రాజునిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞా పింపగా
21 E o rei ordenou a todo o povo, dizendo: Guardai a páscoa diante do SENHOR vosso Deus, como está escrito no livro deste pacto.
22 ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదారాజులయొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను.
22 Certamente, ali não era celebrada uma páscoa assim desde os dias dos juízes que julgavam Israel, nem em todos os dias dos reis de Israel, tampouco dos reis de Judá;
23 ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను.
23 senão, no décimo oitavo ano do rei Josias, no qual esta páscoa foi celebrada ao SENHOR, em Jerusalém.
24 మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహ ములను, యూదాదేశమందును యెరూష లేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీ యాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.
24 Além disso, os que lidam com espíritos familiares, e os feiticeiros, e as imagens, e os ídolos, e todas as abominações que foram espionadas na terra de Judá e em Jerusalém, Josias lançou fora, para que pudesse cumprir as palavras da lei, as quais estavam escritas no livro que Hilquias, o sacerdote, encontrou na casa do SENHOR.
25 ​అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు.
25 E antes dele não houve rei como ele, que se voltou ao SENHOR com todo o seu coração, e com toda a sua alma, e com todo o seu poder, segundo toda a lei de Moisés; nem depois dele se levantou ali alguém como ele.
26 ​అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను.
26 Não obstante, o SENHOR não se voltou do ardor da sua grande ira com a qual foi acesa contra Judá, por causa de todas as provocações com as quais Manassés ao mesmo tempo lhe havia provocado.
27 కాబట్టి యెహోవానేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను.
27 E o SENHOR disse: Também quero remover Judá da minha vista, assim como removi Israel, e lançarei fora esta cidade, Jerusalém, a qual tenho escolhido, e a casa da qual eu disse: O meu nome estará ali.
28 యోషీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
28 Ora, o restante dos atos de Josias, e tudo o que ele fez, não estão escritos no livro das Crônicas dos reis de Judá?
29 అతని దినముల యందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.
29 Nos seus dias Faraó-Neco, rei do Egito, partiu para junto do rei da Assíria, até o rio Eufrates; e o rei Josias foi contra ele; e ele o matou em Megido, quando o avistou.
30 అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.
30 E os seus servos o carregaram morto em uma carruagem, desde Megido, e o trouxeram até Jerusalém, e o sepultaram no seu próprio sepulcro. E o povo da terra tomou Joacaz, o filho de Josias, e o ungiu, e fê-lo rei, no lugar do seu pai.
31 యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె యగు హమూటలు.
31 Joacaz tinha vinte e três anos de idade quando começou a reinar; e reinou três meses em Jerusalém. E o nome da sua mãe era Hamutal, a filha de Jeremias, de Libna.
32 ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.
32 E ele fez aquilo que era mau à vista do SENHOR, segundo tudo o que os seus pais haviam feito.
33 ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధక ములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి
33 E Faraó-Neco o pôs em grilhões em Ribla, na terra de Hamate, para que ele não pudesse reinar em Jerusalém; e pôs a terra sob tributo de uma centena de talentos de prata, e um talento de ouro.
34 యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.
34 E Faraó-Neco fez de Eliaquim, o filho de Josias, rei no lugar de Josias, o seu pai, e modificou o seu nome para Jeoaquim, e retirou Joacaz; e ele veio ao Egito, e ali morreu.
35 యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశముమీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను.
35 E Jeoaquim deu a prata e o ouro a Faraó; mas ele tributou a terra para dar o dinheiro, de acordo com o mandamento de Faraó; ele exigia a prata e o ouro do povo da terra, de cada um segundo a sua tributação, para dá-la a Faraó-Neco.
36 యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సర ములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివా డైన పెదాయా కుమార్తెయగు జెబూదా.
36 Jeoaquim tinha vinte e cinco anos de idade quando começou a reinar; e reinou onze anos em Jerusalém. E o nome da sua mãe era Zebida, a filha de Pedaías, de Ruma.
37 ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను.
37 E ele fez aquilo que era mau à vista do SENHOR, segundo tudo o que os seus pais haviam feito.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 2 Reis 23, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.