1 Samuel 14
Telugu Bible (GL_TELUGU) vs VC
1 ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన .. తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతముచేయ పోదము రమ్మనెను.
1 Um dia, Jônatas, filho de Saul, disse ao seu escudeiro: Vem, passemos até ao acampamento dos filisteus que está do outro lado. Mas nada disse ao seu pai.
2 సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద దిగియుండెను, అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందలమంది.
2 Saul estava acampado na extremidade de Gabaa, debaixo da romãzeira de Magron, com uma tropa de seiscentos homens aproximadamente.
3 షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీయొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను.
3 Aquias, filho de Aquitob, irmão de lcabod, filho de Finéias, filho de Heli, o sacerdote do Senhor em Silo, levava o efod. O povo ignorava a saída de Jônatas.
4 యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలము నకు పో జూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను, వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవదానిపేరు సెనే.
4 Ora, no desfiladeiro que Jônatas tentava atravessar para atingir a guarnição dos filisteus, havia rochedos altos, em forma de dentes, de um e outro lado, um dos quais se chamava Boses e o outro Sene.
5 ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపువైపునను, రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపువైపునను ఉండెను.
5 Um desses se elevava ao norte, defronte de Macmas, e o outro ao sul, do lado de Gabaa.
6 యోనాతానుఈ సున్నతిలేని వారి దండు కాపరులమీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధ ములు మోయువానితో చెప్పగా
6 Disse, pois, Jônatas ao seu escudeiro: Vem, ataquemos a guarnição desses incircuncisos; talvez o Senhor combaterá por nós. Nada impede que ele dê a vitória a poucos tão bem como a muitos.
7 అతడునీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టాను సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను.
7 Seu escudeiro respondeu-lhe: Faze como te aprouver; vai aonde quiseres, que eu te seguirei aonde deliberares.
8 అప్పుడు యోనాతానుమనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము.
8 Pois bem, replicou Jônatas; marchemos contra esses homens e mostremos-nos a eles.
9 వారు మనలను చూచిమేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము.
9 Se nos disserem: Esperai até que vamos ter convosco, ficaremos em nosso posto, e não subiremos a eles.
10 మాయొద్దకు రండని వారు చెప్పినయెడల యెహోవా వారిని మనచేతికి అప్ప గించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా
10 Se, porém, nos disserem: Subi a nós - iremos, porque o Senhor no-los terá entregue nas mãos. Isso nos servirá de sinal.
11 వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులుచూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు
11 Então, mostraram-se ambos à guarnição dos filisteus. Estes disseram: Eis os hebreus que saem das cavernas onde se tinham escondido.
12 యోనా తానును అతని ఆయుధములను మోయువానిని పిలిచిమేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతానునా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీ యుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయు వానితో చెప్పి
12 E os homens da guarda gritaram a Jônatas e ao escudeiro: Subi a nós; queremos dizer-vos uma coisa. Jônatas disse ao escudeiro: Segue-me, porque o Senhor os entregou nas mãos de Israel.
13 అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోను కాళ్లతోను ప్రాకి యెక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయు వాడు వారిని చంపెను.
13 Subiu, pois, Jônatas, trepando com as mãos e com os pés, seguido do escudeiro. Os filisteus caíram diante de Jônatas, e o seu escudeiro matava-os atrás dele.
14 యోనాతానును అతని ఆయు ధములు మోయు వాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరి గెను.
14 Esse foi o primeiro massacre que fizeram Jônatas e o seu escudeiro, metade de uma jeira de terra.
15 దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.
15 Espalhou-se o terror no acampamento dos filisteus, assim como na região e entre todo o povo. A guarnição e os saqueadores ficaram tomados de espanto, e a terra ficou em pânico: pois aquilo era como um terror de Deus.
16 దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా
16 As sentinelas de Saul que estavam em Gabaa de Benjamim, viram a multidão de fugitivos que se dispersava por todos os lados.
17 సౌలుమీరు లెక పెట్టి మనయొద్ద లేనివారెవరో చూడుడని తనయొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలిసికొనిరి.
17 Saul disse ao povo: Fazei uma chamada e vede quem saiu dentre nós. Fez-se a chamada e verificou-se a falta de Jônatas e de seu escudeiro.
18 దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులయొద్ద ఉండగాదేవుని మందసమును ఇక్కడికి తీసికొనిరమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను.
18 Saul disse a Aquias: Faze aproximar a arca de Deus. {Porque a arca de Deus se encontrava naquele dia com os israelitas.}
19 సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి యెక్కువగా వినబడెను; కాబట్టి సౌలు యాజకునితోనీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి
19 Enquanto Saul falava ao sacerdote, o tumulto no acampamento dos filisteus crescia cada vez mais. Saul disse ao sacerdote: Retira a tua mão.
20 తానును తనయొద్ద నున్న జనులందరును కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొను చుండిరి.
20 O rei e todo o povo que estavam com ele foram até o lugar do combate: os filisteus, numa extrema confusão, voltavam a espada uns contra os outros.
21 మరియు అంతకుమునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితోకూడ దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీ యులతో కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి.
21 Os hebreus que tinham estado desde há muito tempo com os filisteus, e que os tinham seguido ao acampamento, voltaram e puseram-se do lado dos israelitas que estavam com Saul e Jônatas.
22 అదియు గాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి.
22 Igualmente todos os israelitas que se tinham escondido no monte de Efraim, sabendo que os filisteus tinham fugido, saíram a persegui-los para os ferir.
23 ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి.
23 Naquele dia, o Senhor deu a vitória a Israel. O combate prosseguiu até além de Bet-Aven.
24 నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అనిసౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి.
24 Os israelitas estavam extenuados naquele dia, porque Saul conjurara o povo, dizendo: Maldito seja o homem que tomar alimento antes do anoitecer, antes que eu me tenha vingado de meus inimigos. Por isso ninguém tinha comido.
25 జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను.
25 Todos tinham entrado numa floresta, onde havia mel na superfície do solo.
26 జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు.
26 o povo entrou, pois, na floresta e viu o mel que corria, mas ninguém levou a mão à boca, por respeito ao juramento.
27 అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను.
27 Mas Jônatas, ignorando o juramento que o seu pai obrigara o povo a fazer, estendeu a ponta da vara que tinha na mão, mergulhou-a num favo de mel e o levou à boca. Então seus olhos {fatigados} brilharam.
28 జనులలో ఒకడునీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించిఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.
28 Um homem do grupo disse-lhe: Teu pai fez jurar o povo, dizendo: Maldito o homem que hoje tomar alimento. E o povo estava esgotado.
29 అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి
29 Jônatas disse: Meu pai fez mal à terra. Vede como se me iluminaram os olhos, porque comi um pouco de mel.
30 జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్లవలన బాగుగా భోజనము చేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను.
30 Ah! se o povo tivesse hoje comido da presa tomada ao inimigo, não teria sido muito maior a derrota dos filisteus?
31 ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.
31 Eles bateram, naquele dia, os filisteus desde Macmas até Ajalon.
32 జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున
32 O povo, esgotado de fadiga, lançou-se sobre a presa e tomou as ovelhas, os bois e os bezerros, que degolou sobre a terra, comendo a carne juntamente com o sangue.
33 జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడుమీరు విశ్వాస ఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి
33 Eis que o povo está pecando contra o Senhor, vieram dizer a Saul, comendo carne com sangue. Isso é uma impiedade, exclamou o rei; revolvei-me já para aqui uma grande pedra.
34 మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి, అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱలను నాయొద్దకు తీసికొనివచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరు ఆ రాత్రి తమ తమ యెద్దులను తీసికొని వచ్చి అక్కడ వధిం చిరి.
34 Ide por todo o povo, ajuntou, e dizei-lhes que cada um me traga as suas ovelhas e os seus bois, para que sejam degolados aqui. Comê-los-eis então, sem pecar contra o Senhor, comendo carne com sangue. Cada um deles levou naquela noite o gado que tinha em mãos e o degolou ali.
35 మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే.
35 Saul edificou um altar ao Senhor. Este foi o primeiro altar que ele levantou.
36 అంతటమనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించువా డొకడును లేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలుయాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి
36 Depois Saul disse: Desçamos durante a noite contra os filisteus e despojemo-los até os primeiros albores do dia e não deixemos vivo um só homem deles. O povo disse: Faze tudo o que melhor te parecer. Então o sacerdote disse: Aproximemo-nos aqui de Deus.
37 సౌలుఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను.
37 Saul consultou a Deus: Perseguirei os filisteus? Entregá-los-eis nas mãos de Israel? Mas Deus não lhe respondeu dessa vez.
38 అందువలన సౌలుజనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను.
38 Saul disse: Fazei vir aqui todos os chefes do povo; investigar e dizei-me qual é o pecado que hoje se cometeu.
39 నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీ యులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమా ణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చిన వాడు ఒకడును లేకపోయెను.
39 Pela vida do Senhor, libertador de Israel! Mesmo que fosse o meu filho Jônatas, ele morrerá! Mas ninguém na multidão lhe respondeu.
40 మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి.
40 Ponde-vos de um lado, disse ele a todo o Israel; eu e meu filho Jônatas estaremos do outro. A multidão respondeu-lhe: Faze o que te parecer melhor.
41 అప్పుడు సౌలుఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి.
41 Saul disse ao Senhor: Deus de Israel, dai-nos a conhecer a verdade! Jônatas e Saul foram designados pela sorte, e o povo ficou livre.
42 నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.
42 Então Saul disse: Lançai a sorte entre mim e Jônatas, meu filho. E caiu a sorte em Jônatas.
43 నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతానునా చేతికఱ్ఱకొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను.
43 Confessa-me o que fizeste, disse Saul ao seu filho. Jônatas contou-lhe: Provei um pouco de mel com a ponta da vara que eu. tinha na mão. Eis que vou morrer!
44 అందుకు సౌలుయోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.
44 Saul disse: Trate-me Deus com todo o rigor, se não morreres, Jônatas!
45 అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
45 Mas o povo interveio: Como haveria de perecer Jônatas, ele que deu essa vitória tão grande a Israel? Isso não pode ser! Viva Deus! Nem um só cabelo de sua cabeça cairá por terra, porque foi por Deus que ele operou hoje dessa forma. Assim o povo salvou Jônatas, e ele não morreu.
46 అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి.
46 Saul voltou e não perseguiu os filisteus, que foram para as suas terras.
47 ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధి కారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మాయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీ యులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారి నందరిని ఓడించెను.
47 Saul, depois de ter tomado posse do reino de Israel, combateu contra todos os inimigos da vizinhança: Moab, os amonitas, Edom, os reis de Soba, os filisteus; para onde quer que se voltava, ele vencia.
48 మరియు అతడు దండునుకూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టినవారి చేతిలో నుండి వారిని విడిపించెను.
48 Portou-se valorosamente, feriu Amalec e livrou Israel das mãos dos que o devastavam.
49 సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనా తాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు.
49 Os filhos de Saul foram Jônatas, Jessui e Melquisua; a primogênita de suas duas filhas chamava-se Merob, a mais nova Micol.
50 సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు.
50 Sua mulher chamava-se Aquinoã, filha de Aquimaas. O general de seu exército era Abner, filho de Ner, tio de Saul.
51 సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రి యగు నేరును అబీయేలు కుమారులు.
51 Cís, pai de Saul, e Ner, pai de Abner, eram filhos de Abiel.
52 సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలులనందరిని తనయొద్దకు చేర్చుకొనెను.
52 Durante todo o tempo da vida de Saul a guerra foi encarniçada contra os filisteus. O rei, logo que descobria um homem forte e valente, tomava-o a seu serviço.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar 1 Samuel 14, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.