1 Crônicas 23

Telugu Bible (GL_TELUGU) vs NAA

Sair da comparação
NAA Nova Almeida Atualizada 2017
1 దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.
1 Quando já era bem velho, Davi constituiu o seu filho Salomão rei sobre Israel.
2 మరియు అతడు ఇశ్రా యేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను.
2 Davi reuniu todos os chefes de Israel, bem como os sacerdotes e levitas.
3 అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు.
3 Foram contados os levitas de trinta anos para cima, e seu número, contados um por um, foi de trinta e oito mil homens.
4 ​వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను,ఆరు వేలమంది అధి పతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.
4 Destes, havia vinte e quatro mil para supervisionarem a obra da Casa do Senhor , seis mil oficiais e juízes,
5 ​నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.
5 quatro mil porteiros e quatro mil para louvarem o Senhor com os instrumentos que Davi fez para esse fim.
6 ​గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
6 Davi os repartiu por turnos, segundo os filhos de Levi: Gérson, Coate e Merari.
7 లద్దాను కుమారులు ముగ్గురు;
7 Os filhos de Gérson foram: Ladã e Simei.
8 ​పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు
8 Os filhos de Ladã foram: Jeiel, o chefe, Zetã e Joel, três ao todo.
9 షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.
9 Os filhos de Simei foram: Selomite, Haziel e Harã, três ao todo. Estes foram os chefes das famílias de Ladã.
10 యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.
10 Os filhos de Simei foram: Jaate, Ziza, Jeús e Berias. Estes foram os filhos de Simei, quatro ao todo.
11 యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమా రులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.
11 Jaate era o chefe e Ziza era o segundo. Jeús e Berias não tiveram muitos filhos e por isso estes dois foram contados como uma só família.
12 కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.
12 Os filhos de Coate foram: Anrão, Isar, Hebrom e Uziel, quatro ao todo.
13 అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధ మైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యే కింపబడిరి.
13 Os filhos de Anrão foram: Arão e Moisés. Arão foi separado para servir no Santo dos Santos, ele e os seus filhos, para sempre, e para queimar incenso diante do Senhor , para o servir e para dar a bênção em seu nome, para sempre.
14 దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.
14 Quanto a Moisés, homem de Deus, seus filhos foram contados entre a tribo de Levi.
15 ​మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
15 Os filhos de Moisés foram: Gérson e Eliézer.
16 ​గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
16 O filho de Gérson foi Sebuel, o chefe.
17 ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.
17 O filho de Eliézer foi Reabias, o chefe; e ele não teve outros filhos; mas os filhos de Reabias se multiplicaram grandemente.
18 ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.
18 Os filhos de Isar foram: Selomite, o chefe.
19 హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు,యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
19 Os filhos de Hebrom foram: Jerias, o chefe, Amarias, o segundo, Jaaziel, o terceiro, e Jecameão, o quarto.
20 ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.
20 Os filhos de Uziel foram: Mica, o chefe, e Issias, o segundo.
21 ​మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
21 Os filhos de Merari foram: Mali e Musi. Os filhos de Mali foram: Eleazar e Quis.
22 ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.
22 Eleazar morreu e não teve filhos, porém filhas; e os filhos de Quis, seus parentes, casaram com elas.
23 మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.
23 Os filhos de Musi foram: Mali, Éder e Jerimote, três ao todo.
24 వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.
24 Estes foram os filhos de Levi, segundo as suas famílias e chefes delas, segundo foram contados nominalmente, um por um, de vinte anos para cima, encarregados do ministério da Casa do Senhor .
25 ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు
25 Porque Davi disse: — O
26 లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.
26 Assim, os levitas já não precisarão levar o tabernáculo e nenhum dos utensílios para o seu ministério.
27 దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.
27 Porque, segundo as últimas palavras de Davi, foram contados os filhos de Levi de vinte anos para cima.
28 వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,
28 O serviço deles era ajudar os filhos de Arão no ministério da Casa do Senhor , nos átrios e nas câmaras, na purificação de todas as coisas sagradas e na obra do ministério da Casa de Deus,
29 ​సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,
29 a saber, cuidar dos pães da proposição, da melhor farinha para a oferta de cereais, dos bolos sem fermento, das ofertas assadas e das misturadas com azeite, bem como dos pesos e das medidas.
30 ​అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.
30 Deviam estar presentes todas as manhãs e todas as tardes para darem graças ao Senhor e o louvarem,
31 ​సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు,
31 e sempre que fossem oferecidos os holocaustos do Senhor , nos sábados, nas Festas da Lua Nova e nas festas fixas, diante do Senhor , segundo o número determinado.
32 ​​యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.
32 Os filhos de Levi deviam cuidar da tenda do encontro e do santuário e deviam ajudar os filhos de Arão, seus irmãos, no ministério da Casa do Senhor .

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 23, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.