Isaías 45

హోలీ బైబిల్ (TEL2010)

1 యెహోవా ఏర్పాటు చేసుకొన్న తన రాజు కోరెషుతో ఆయన చెప్పిన సంగతులు ఇవి:

2 కోరెషూ, నీ సైన్యాలు ముందడుగు వేస్తాయి. నేను నీకు ముందుగా వెళ్తాను.

3 చీకట్లో దాచిపెట్టబడిన ధనం నేను నీకు ఇస్తాను.

4 నా సేవకుడు యాకోబు కోసం నేను వీటిని చేస్తున్నాను.

5 నేను యెహోవాను. నేను ఒక్కడినే దేవుడను.

6 నేను ఒక్కడను మాత్రమే దేవుడనని ప్రజలంతా తెలుసుకోవాలని నేను ఈ సంగతులను చేస్తాను.

7 నేనే వెలుగును కలిగించాను. మరి నేనే చీకటిని చేశాను.

8 “పైన ఆకాశంలోని మేఘాలు మంచితనాన్ని

9 “ఈ ప్రజలను చూడు! వాళ్లు వారిని సృజించిన వానితో వాదిస్తున్నారు. వాళ్లు నాతో వాదించటం చూడు. వాళ్లు పగిలిపోయిన కుండ పెంకులా ఉన్నారు. ఒకడు కుండ చేయటానికి జిగట మన్ను ఉపయోగిస్తాడు. మరి ఆ మట్టి, ‘ఓ మనిషీ, ఏం చేస్తున్నావు?’ అని అడగదు. తయారు చేయబడిన వస్తువులకు వాటిని తయారుచేసిన వానిని ప్రశ్నించే అధికారం లేదు. మనుష్యులు ఈ మట్టిలాగే ఉన్నారు.

10 ఒక తండ్రి తన పిల్లలకు ప్రాణం పోస్తాడు. మరి పిల్లలు, ‘నీవెందుకు నాకు ప్రాణం పోస్తున్నావు?’ అని అడిగేందుకు అధికారం లేదు. పిల్లలు తల్లిని పట్టుకొని, ‘నీవెందుకు నాకు జన్మనిస్తున్నావు?’ అని ప్రశ్నించేందుకు వీల్లేదు.”

11 యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఆయనే ఇశ్రాయేలీయులను సృజించాడు. మరియు యెహోవా అంటున్నాడు:

12 కనుక చూడండి! భూమిని నేనే సృజించాను.

13 కోరెషు మంచి పనులు చేసేందుకు అతని శక్తిని నేనే అతనికి ఇచ్చాను.

14 యెహోవా చెబతున్నాడు, “ఈజిప్టులో, ఇథియోపియాలో ఎన్నో సంగతులు చేయబడ్డాయి.

15 దేవా, నీవు ప్రజలు చూడలేని దేవుడవు.

16 చాలామంది ప్రజలు తప్పుడు దేవుళ్లను చేసుకొంటారు.

17 కానీ ఇశ్రాయేలు యెహోవా చేత రక్షించబడును.

18 యెహోవాయే దేవుడు.

19 నేను రహస్యంగా మాట్లాడలేదు. నేను స్వేచ్చగా మాట్లాడాను.

20 “ప్రజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించుకొని పోయారు. కనుక మీరు సమావేశమై నా ఎదుటికిరండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను మోసుకొని వెళ్తారు. ఈ ప్రజలు పనికిమాలిన ఆ దేవుళ్లకు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో ప్రజలకు తెలియదు.

21 ఈ ప్రజలను నా దగ్గరకు రమ్మని వారికి చెప్పండి. వారు వచ్చి ఈ సంగతులను నాతో మాట్లాడమని చెప్పండి.)

22 దూర దేశాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా ఆ తప్పుడు దేవుళ్లను వెంబడించటం మానివేయాలి. మీరు నన్ను వెంబడించి, రక్షణ పొందాలి. నేను దేవుణ్ణి. వేరొక దేవుడు ఎవ్వడూ లేడు. నేను ఒక్కణ్ణి మాత్రమే దేవుడను.

23 “నేను నా స్వంత శక్తితో ఒక వాగ్దానం చేస్తాను. నేను ఏదైన ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఒక ఆదేశం అవుతుంది. ఏదైనా జరగాలని నేను ఆదేశిస్తే, అది జరుగుతుంది. ప్రతి మనిషి నా (దేవుడు) ఎదుట సాగిలపడతాడని నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మనిషి నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తాడు.

24 ‘మంచితనం, అధికారం యెహోవా నుండి మాత్రమే లభిస్తాయి’” అని ప్రజలు చెబతారు.

25 ఇశ్రాయేలు ప్రజలు మంచిని జరిగించటానికి యెహోవా సహాయం చేస్తాడు, మరియు ప్రజలు వారి దేవుని గూర్చి ఎంతో గర్విస్తారు.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Isaías 45, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.