Ezequiel 17

హోలీ బైబిల్ (TEL2010)

1 తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు,

2 “నరపుత్రుడా! ఇశ్రాయేలు వంశానికి ఈ కథ వినిపించు. దాని అర్థమేమిటో వారినడుగు.

3 వారికి ఇలా చెప్పు:

4 గరుడపక్షి రాజు ఆ పెద్ద దేవదారు వృక్షపు (లెబానోను) తలతుంచి వేసింది.

5 కనాను నుండి పిదప కొన్ని విత్తనాల (ప్రజల)ను గరుడ పక్షి తీసుకుంది.

6 ఆ విత్తనం మొలకెత్తి ద్రాక్షా చెట్టయ్యింది.

7 మరో పెద్ద రెక్కల గరుడ పక్షి ద్రాక్షా మొక్కను చూసింది.

8 సారవంతమైన భూమిలో నాటబడింది ద్రాక్షామొక్క. మంచి నీటివనరు వున్నచోట నాట బడింది.

9 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

10 అది నాటబడిన చోట మొక్క పెరుగుతుందా?

11 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:

12 “ఇశ్రాయేలు ప్రజలకు ఈ కథ వివరించు. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ నాపై తిరుగు బాటు చేస్తూవున్నారు. వారికి ఈ విషయాలు వివరించు. మొదటి గరుడపక్షి రాజు నెబుకద్నెజరు. అతడు బబులోను (బాబిలోనియా) రాజు. అతడు యెరూషలేముకు వచ్చి రాజును, ఇతర పెద్దలను తీసుకొని పోయాడు. వారిని బబులోనుకు తీసుకొని వెళ్లాడు.

13 పిమ్మట రాజ కుటుంబంలోని ఒకనితో నెబుకద్నెజరు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. ఒక వాగ్దానం చేయమని అతనిని నెబుకద్నెజరు ఒత్తిడి చేశాడు. అందువల్ల అతడు నెబుకద్నెజరు పట్ల రాజ భక్తి కలిగి వుండటానికి మాట ఇచ్చాడు. నెబకద్నెజరు ఇతనిని యూదాకు రాజుగా నియమించాడు. తరువాత అతడు శక్తియుక్తులున్న మనుష్యులందరినీ యూదా నుండి తీసుకొనిపోయాడు.

14 దానితో యూదా ఒక బలహీన రాజ్యంగా మారిపోయింది. అందువల్ల అది రాజైన నెబుకద్నెజరును ఎదిరించలేక పోయింది. యూదా యొక్క నూతన రాజుతో చేసుకొన్న ఒడంబడికను ఆచరించేలా నెబుకద్నెజరు ప్రజలపై ఒత్తిడి తెచ్చాడు.

15 ఆయినప్పటికీ ఈ కొత్త రాజు నెబుకద్నెజరుపై తిరుగుబాటు ప్రయత్నం చేశాడు! అతడు తన దూతలను ఈజిప్టుకు పంపి సహాయం అర్థించాడు. కొత్తరాజు అనేక గుర్రాలను, సైనికులను అడిగాడు. మరి ఈ నూతన యూదా రాజు విజయం సాధిస్తాడని ఇప్పుడు మీరనుకుంటున్నారా? ఒడంబడికను ఉల్లంఘించి, శిక్షనుండి తప్పించుకునేటంత శక్తి ఈ కొత్త రాజుకు ఉన్నదని మీరనుకుంటున్నారా?”

16 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నా జీవ ప్రమాణంగా ఈ కొత్త రాజు బబులోనులో చనిపోతాడని నిశ్చయంగా చెప్పుతున్నాను! ఈ వ్యక్తిని యూదా రాజుగా నెబుకద్నెజరు నియమించాడు. కాని ఇతడు నెబుకద్నెజరుకు ఇచ్చినమాట నిలబెట్టుకోలేదు. ఈ కొత్తరాజు ఒడంబడికను నిరాదరించి విడిచి పెట్టాడు.

17 పైగా ఈజిప్టు రాజు యూదా రాజును రక్షించలేడు. అతడు అనేకమంది సైనికులను పంపవచ్చు. కాని ఈజిప్టుకు వున్న మహా బలసంపత్తి యూదాను రక్షించలేదు. నెబుకద్నెజరు సైన్యం నగరాన్ని పట్టుకొనటానికి మట్టిదారులు, మట్టి గోడలు నిర్మిస్తుంది. అనేకమంది చనిపోతారు.

18 అయినా యూదా రాజు తప్పించుకోలేడు. ఎందుకంటే, తన ఒడంబడిక అతడు అలక్ష్యం చేశాడు. అతడు నెబుకద్నెజరుకు ఇచ్చిన మాట తప్పాడు.”

19 నా ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేస్తున్నాడు: “నా జీవ ప్రమాణంగా యూదా రాజును శిక్షిస్తానని నిశ్చయంగా చెప్పుతున్నాను. ఎందువల్లనంటే, అతడు నా హెచ్చరి కలను లెక్కచేయలేదు. అతడు మా ఒడంబడికను ఉల్లంఘించాడు.

20 నేను నావల పన్నుతాను. అతడందులో చిక్కుకొంటాడు. అతనిని నేను బబులోనుకు తీసుకొనివచ్చి అక్కడ శిక్షిస్తాను. అతడు నా పై తిరుగుబాటు చేశాడు గనుక నేనతనిని శిక్షిస్తాను.

21 నేనతని సైన్యాన్ని నాశనం చేస్తాను. గొప్ప యోధులగు అతని సైనికులను చంపివేస్తాను. చావగా మిగిలిన వారిని చెల్లాచెదురు చేస్తాను. నేనే యెహావాననీ, నీకు ఈ మాటలు చెప్పినది నేనే అనీ, నీవప్పుడు తెలుసుకొంటావు.”

22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:

23 నేనే దానిని ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతంపై నాటుతాను.

24 “నేను పొడవైన వృక్షాలన్నిటినీ నేలకు పడేస్తానని ఇతర చెట్లన్నీ అప్పుడు తెలుసుకొంటాయి.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Ezequiel 17, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.